ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

చెప్పాలంటే హీరోయిన్లు తక్కువ వయసులో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు. కనీసం వాళ్లకు 35 ఏళ్ల వయసు దాటితేనే పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఇండస్ట్రీలో హీరోయిన్ల లైఫ్ టైం చాలా తక్కువగా ఉంటుంది. ‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ అనే సామెతను వాళ్ళు ఫాలో అవుతూ.. వరుస ఆఫర్లు వస్తున్నప్పుడు పెళ్లి గురించి ఆలోచించకుండా ఎక్కువ సినిమాల్లో నటించి ఆస్తిపాస్తులను, పేరు ప్రఖ్యాతలను సంపాదించుకోవాలని వారు భావిస్తూ ఉంటారు. పెళ్లి చేసుకుంటే అవకాశాలు ఎక్కడ తగ్గిపోతాయో అనే ఉద్దేశంతో వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి తొందరపడరు. ఒకవేళ వాళ్లకు అవకాశాలు తగ్గిపోయాయి అనుకున్న టైములో కచ్చితంగా పెళ్ళికి రెడీ అవుతుంటారు.

అయితే అందరు హీరోయిన్లు ఇదే ఫాలో అవుతారా అంటే కచ్చితంగా అవునని చెప్పలేము. చాలా మంది హీరోయిన్లు చిన్న వయసులోనే పెళ్లి పీటలు ఎక్కేసారు. వాళ్ళెవరెవరో ఓ లుక్కేద్దాం రండి :

1) సయేషా సైగల్ :

‘అఖిల్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సయేషా.. ఆ తరువాత తమిళ సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతుంది. అయితే అదే టైంలో హీరో ఆర్యను ప్రేమ వివాహం చేసుకుంది ఈ బ్యూటీ. పెళ్లి టైంకి ఈమె వయసు కేవలం 21 సంవత్సరాలు మాత్రమే..!

2) దివ్య భారతి :

‘బొబ్బిలి రాజా’,’రౌడీ అల్లుడు’, ‘అసెంబ్లీ రౌడీ’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన హీరోయిన్ దివ్య భారతి.ఈమె 18 ఏళ్ల వయసులోనే బాలీవుడ్ నిర్మాత అయిన షాజిత్ ను పెళ్లి చేసుకుంది.

3) లక్ష్మీ :

ఒకప్పటి హీరోయిన్ లక్ష్మీ ఇప్పుడు బామ్మ పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈమె తన 17 ఏళ్ల వయసులోనే వివాహం చేసుకోవడం గమనార్హం.

4) జెనీలియా :

ఈమె స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న టైంలోనే బాలీవుడ్ హీరో మరియు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొడుకు అయిన రితేష్ దేశముఖ్ ను ప్రేమ వివాహం చేసుకుంది.అప్పటికి ఈమె వయసు కేవలం 24 ఏళ్ళు.

5) అదితి రావు హైదరి :

‘సమ్మోహనం’ హీరోయిన్ అదితిరావు హైదరి కూడా 21ఏళ్ళ వయసులోనే పెళ్లి చేసుకుంది.

6) సారిక :

సీనియర్ హీరోయిన్ సారిక కూడా తన 27ఏళ్ళ వయసులోనే కమల్ హాసన్ ను పెళ్లి చేసుకుంది.

7 ) షాలిని :

‘సఖి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన షాలిని కూడా తన 21వ ఏటనే స్టార్ హీరో అజిత్ ను పెళ్లి చేసుకుంది.

8) శ్రీదేవి విజయ్ కుమార్ :

ప్రభాస్ హీరోగా నటించిన ‘ఈశ్వర్’ చిత్రంలో హీరోయిన్ గా నటించిన శ్రీదేవి కూడా.. 23ఏళ్ళ వయసులోనే పెళ్లి చేసుకుంది.

9) మల్లికా శరావత్ :

23 ఏళ్ళ వయసులోనే పెళ్లి పీటలెక్కింది బాలీవుడ్ హీరోయిన్ మల్లికా శరావత్.

10) రాధికా ఆప్తె :

బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ రాధికా ఆప్తె కూడా 27 ఏళ్ళ వయసులోనే పెళ్లిచేసుకుంది.

11) అమలా పాల్ :

23 ఏళ్ళ వయసులోనే దర్శకుడు ఏ.ఎల్.విజయ్ ను పెళ్లి చేసుకుంది అమలా పాల్.

12) నిషా అగర్వాల్ :

కాజల్ చెల్లెలు నిషా అగర్వాల్ కూడా 24 ఏళ్ళ వయసులోనే పెళ్లి చేసుకుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus