ఇంటర్- క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నా.. మా ఆయన నాకు లిమిట్స్ పెట్టరు: ఇంద్రజ

Advertisement

ఇప్పుడంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తల్లి,అత్త పాత్రలు చేస్తోంది కానీ గతంలో గ్లామర్ తో టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసిన హీరోయిన్లలో ఇంద్రజ కూడా ఒకరు. ‘హలో బ్రదర్’ చిత్రంలో ఓ పాటలో అదిరిపోయే స్టెప్పులు వేసి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు ఇంద్రజ. ఆ తరువాత ‘జంతర్ మంతర్’ ‘యమలీల’ ‘అమ్మ దొంగ’ వంటి సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నారు. తెలుగు,తమిళ, కన్నడ,మలయాళం భాషల్లో కలిపి 80 సినిమాల వరకూ చేసింది. ఈమె ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడకు చెందినావిడే..! ఈమె పర్సనల్ లైఫ్ గురించి బహుశా ఎక్కువగా ఎవరికీ తెలిసి ఉండదు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఈమె తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను చెప్పుకొచ్చింది.

ఆమె మాట్లాడుతూ.. “నేను కూడా తెలుగమ్మాయినే.. బ్రహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయిని. ఇప్పటికీ అలానే ఉన్నాను. నా భర్త ముస్లిం. మతానికి. మనసుకి సంబంధం ఉండదు. ఒకరిని ఒకరం ఇష్టపడ్డాం. మతం చూసి, కులం చూసి ఇష్టపడం కదా..! ఇలా నేను చెప్తుంటే సినిమా డైలాగ్‌లా అనిపించొచ్చు. బట్.. ఇది సినిమా డైలాగ్ కాదు. ఇది నా రియల్ లైఫ్ డైలాగ్. మా ఇద్దరికీ మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉండేవారు. నేను నా భర్త ఆరేళ్ళ పాటు ఫ్రెండ్స్ గా ఉన్నాం. పరిచయమైన వెంటనే పెళ్లి చేసుకోలేదు. ఒకరి అభిప్రాయాలను ఒకరం తెలుసుకోవడం.. అర్థం చేసుకోవడం వంటివి జరిగాయి. లైఫ్ అంతా నాకు అతను సపోర్ట్ గా ఉంటాడనిపించింది. బహుశా అదే నమ్మకం ఆయనకి కూడా కలిగి ఉండొచ్చు. ఇద్దరికీ ఆ నమ్మకం కలిగిన తరువాతే పెళ్లి చేసుకున్నాం.నా భర్తకి కూడా ఇండస్ట్రీలో సంబంధాలు ఉన్నాయి. ఆయన కూడా రచయితగా పనిచేసారు.!

అంతేకాదు పలు సీరియల్స్ లో నటించారు. అలాగే యాడ్ ఫిల్మ్ మేకర్ గా కూడా పనిచేసారు. మా మామయ్య వాళ్ళకి బిజినెస్ లు ఉన్నాయి. గవర్నమెంట్ ఎక్స్ పోర్ట్ బిజినెస్. నా భర్త వాళ్ళ అన్నయ్య కాలిఫోర్నియాలో ఉంటారు. అక్కడి బిజినెస్ లు ఆయన చూసుకుంటారు.. ఇక్కడి బిజినెస్ లను మా ఆయన, మావయ్యగారు చూసుకుంటారు. నేను మావారు సినిమాల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటాం. ఆయన రాసిన కథని మలయాళంలో దర్శకుడు శ్రీనివాస్ గారు తీసుకున్నారు. అలాగే నా సినిమాల విషయాల్లో కూడా నా భర్త ఇన్వాల్వ్ అవుతుంటారు. అలా అని నాకు లిమిట్స్ ఏం పెట్టరు” అంటూ చెప్పుకొచ్చారు ఇంద్రజ.

1

2

3

4

5

 


‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus