పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!

హీరోయిన్లు అన్నాక ఫిట్నెస్ ను కాపాడుకోవడానికి ఎన్నో వర్కౌట్లు చేస్తుంటారు.యోగాసనాలు వేస్తారు.. డైట్ లు పాటిస్తారు.. జ్యూస్ లు ఎక్కువ త్రాగుతారు. ఇవన్నీ ఎలా ఉన్నా మేకప్ అనే అస్త్రం ఒకటి ఉంది కాబట్టి.. వాళ్ళ ఏజ్ ను కనపడకుండా కప్పేస్తుంది. సరే ఇప్పుడు అసలు విషయానికి వస్తే కొంతమంది టాలీవుడ్ భామలు పెళ్ళైనప్పటికీ కూడా పెళ్ళైన వారిలా కనిపించడం లేదు. ఒకవేళ వీళ్లకు పెళ్లయింది ఎక్కడైనా చెప్తే.. ‘ఏంటి వీళ్లకు పెళ్లైందా’ అని నోరెళ్లబెడుతున్నారు. దానికి కారణం వీళ్ళు సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకోవడం వల్లనో లేక వీళ్ళ పెళ్లి డీటెయిల్స్ గూగుల్ తల్లి చూపించకపోవడం వల్లనో అనేది.. అంతు చిక్కని ప్రశ్న. సరే ప్రేక్షకులను అలా ఆశ్చర్యానికి గురి చేస్తున్న ఆ భామలు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

1) అదితి రావు హైదరి :

మణిరత్నం డైరెక్షన్లో వచ్చిన ‘చెలియా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అదితి. ఆ తరువాత ‘నవాబ్’ ‘పద్మావత్’ ‘సమ్మోహనం’ ‘అంతరిక్షం’ ‘వి’ వంటి సినిమల్లో కూడా నటించింది. ఈమె సత్యదేవ్ మిశ్రా ను 2009లో వివాహం చేసుకుందన్న విషయం చాలా మందికి తెలీదు. అయితే 2013లో వీళ్ళు విడిపోవడం కూడా జరిగింది.

2) ఆకాంక్ష సింగ్ :

సుమంత్ హీరోగా ‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ‘మళ్ళీ రావా’ చిత్రంతో ఈమె హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తరువాత ‘దేవదాస్’ ‘పహిల్వాన్’ వంటి చిత్రాల్లో కూడా ఈమె నటించింది. అయితే ఈమెకు కునాల్ సైన్ అనే సీరియల్ యాక్టర్ తో 2012 లో పెళ్ళైన సంగతి చాలా మందికి తెలీదు.

3) నజ్రియా :

‘ రాజా రాణి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నజ్రియా.. ఇప్పుడు నాని హీరోగా రూపొందుతోన్న ‘అంటే సుందరానికి’ అనే చిత్రంలో నటిస్తుంది. వివేక్ ఆత్రేయ ఈ చిత్రానికి దర్శకుడు. అయితే ఈమెకు హీరో ఫహాద్ ఫాజిల్ తో 2014 లో వివాహం జరిగింది. ఇతను కూడా ‘పుష్ప’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు విలన్ గా పరిచయం కాబోతున్నాడు.

4) రాధికా ఆప్టే :

‘రక్త చరిత్ర’ ‘లెజెండ్’ ‘లయన్’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రాధికా ఆప్టే కూడా బెనెడిక్ట్ టేలర్ అనే వ్యక్తితో డేటింగ్ చేసి 2013 లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది.

5) హిమజ :

సీరియల్స్ లో హీరోయిన్ గా నటించిన హిమజ.. అటు తరువాత ‘నేను శైలజ’ ‘శతమానం భవతి’ ‘మహానుభావుడు’ ‘ధృవ’ ‘స్పైడర్’ ‘వినయ విధేయ రామ’ వంటి చిత్రాల్లో నటించింది. ఈమె 2012లోనే రాజేష్ ఆనందన్ అనే బిజినెస్మెన్ ను పెళ్లి చేసుకుందని ‘https://starsunfolded.com/himaja-reddy/’ వారి సమాచారం.

6) సనా ఖాన్ :

కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘కత్తి’ సినిమాతో ఈమె తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తరువాత ‘గగనం’ ‘మిస్టర్ నూకయ్య’ వంటి చిత్రాల్లో కూడా నటించింది. ఈమె గతేడాది అంటే 2020 లో సయ్యద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.

7) షాలినీ వడ్నికట్టి :

‘కృష్ణ అండ్ హిజ్ లీల’ ‘భానుమతి అండ్ రామకృష్ణ’ ‘యురేకా’ వంటి చిత్రాల్లో నటించిన హీరోయిన్ షాలినీ కూడా 2020 లో డైరెక్టర్ మనోజ్ బీదను పెళ్లి చేసుకుంది.

8) నీతి టేలర్ :

త్రినాధ్ రావు నక్కిన డైరెక్షన్లో వచ్చిన ‘మేం వయసుకు వచ్చాం’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన నీతి కూడా గతేడాది పరీక్షిత్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది.

9) మమతా మోహన్ దాస్ :

ఎన్టీఆర్ తో ‘యమదొంగ’, నితిన్ తో ‘విక్టరీ’, వెంకటేష్ తో ‘చింతకాయల రవి’ వంటి చిత్రాల్లో నటించిన మమతా మోహన్ దాస్ కూడా పరాజిత్ పద్మనాభన్ అనే వ్యక్తిని 2011లో పెళ్లి చేసుకుని .. 2012లోనే విడిపోయింది.

10) అనీషా అంబ్రోస్ :

‘అలియాస్ జానకి’ అనే చిత్రంలో నటించిన ఈ బ్యూటీ ఆ తరువాత పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ అనే చిత్రంలో కూడా నటించాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వలన చివరి నిమిషంలో తప్పుకుంది.తరువాత ‘గోపాల గోపాల’ ‘సెవెన్’ అనే చిత్రాల్లో ఈమె నటించింది. ఇదిలా ఉండగా.. గుణనాథ్ జక్కా అనే వ్యక్తిని 2019లోనే ఈమె వివాహం చేసుకుందన్న సంగతి చాలా మందికి తెలీదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus