Karishma Kotak: చిరంజీవి ‘శంకర్‌దాదా జిందాబాద్’ హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూశారా.. వైరల్ అవుతున్న ఫోటోలు..

  • January 8, 2023 / 10:59 AM IST

కరిష్మా కొఠక్.. మెగాస్టార్ చిరంజీవి ‘శంకర్‌దాదా జిందాబాద్’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.. లండన్‌లో పుట్టి పెరిగిన తనకి హీరోయిన్‌గా ఇదే ఫస్ట్ ఫిలిం.. అంతకుముందు యూకె, ఆ తర్వాత ఇండియాలో మోడలింగ్‌తో పాటు కొన్ని యాడ్స్ చేసింది.. మొదటి సినిమానే మెగాస్టార్ పక్కన ఛాన్స్ అనే సరికి ఎగిరి గంతేసింది. కట్ చేస్తే సినిమా ఘోరంగా ఫ్లాప్ అవడంతో తెలుగులో మళ్లీ అవకాశాలు రాలేదు. కానీ హిందీలో సినిమాలు, టీవీ షోలు, ఇంగ్లీష్‌లో షోలు చేసింది.. ఓ పంజాబీ చిత్రంలోనూ నటించింది..

చివరకి తనకు ఇండియా కలిసి రాలేదనుకుందేమో కానీ లండన్‌లోనే సెటిలైపోయింది.. అయితే ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం బాగా యాక్టివ్‌గా ఉంటుంది. తన అప్‌డేట్స్ అన్నీషేర్ చేస్తుంటుంది. 40 ఏళ్ల కరిష్మా పోస్ట్ చేసే గ్లామరస్ ఫోటోస్, వీడియోలు నెటిజన్లను ఆకట్టుకుంటుంటాయి.. ‘సాలిడి ఫిజిక్, హైట్.. సినిమాల్లో ఎందుకు సక్సెస్ కాలేదు.. రీ ఎంట్రీ ఇవ్వండి’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నెట్టింట కరిష్మా కొఠక్ పిక్స్ వైరల్ అవుతున్నాయి..

 

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus