కస్తూరీ శంకర్..ఇలా చెబితే ప్రేక్షకులకు అర్ధం కాకపోవచ్చు అదే నటి కస్తూరి అంటే కచ్చితంగా అందరికీ ఓ ఐడియా వస్తుంది. అలా కాకుండా ‘గృహలక్ష్మీ’ సీరియల్లో తులసి అంటే ఇక తెలియని వారంటూ ఉండరేమో.ఈమె గతంలో బాలకృష్ణ, నాగార్జున వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించినప్పటికీ… ఈమెను ఇక్కడ మరింత పాపులర్ చేసింది మాత్రం గృహలక్ష్మీ సీరియల్ అనే చెప్పాలి. అంతేకాకుండా నిజ జీవితంలో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది కస్తూరీ.తాను ఫెమినిస్ట్ స్వభావాలు కలిగిన వ్యక్తినని ఆమె చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చింది.
ఇదిలా ఉండగా.. ఆమె ఇటీవల ‘బిగ్ బాస్’ షో గురించి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ‘బిగ్ బాస్ సీజన్ 5′ ప్రారంభమై చాలా రోజులైనప్పటికీ…. ఈమె ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదట. ఇంకా ఇలాంటి షాకింగ్ కామెంట్స్ ఎన్నో చేసింది.’ ‘బిగ్ బాస్5′ కు సంబంధించి నేను ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదు.నాలాంటి వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారా?’ అంటూ కస్తూరి ఇటీవల తన ట్విట్టర్లో పెట్టిన పోస్ట్ కి చాలా సమాధానాలు వచ్చాయి.ఇందులో భాగంగా ఓ నెటిజన్ ‘బిగ్బాస్లో మీరు నాకు నచ్చలేదంటూ’ కామెంట్ పెట్టాడు. దీనికి కస్తూరి సమాధానం ఇస్తూ ‘అక్కడ నిజాలు కనబడవు.
బిగ్బాస్ షో గురించి ప్రేక్షకులకు ఏది కనిపిస్తుందో దాని గురించే మాట్లాడతారు. కానీ హౌస్ నుండీ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ మరోలా మాట్లాడతారు. 24 గంటలు హౌస్ లో ఉన్న వాళ్ళ గురించి కేవలం గంట నిడివి గల ఒక వీడియోని వదులుతారు. మంచిని చెడుగా.. చెడుని మంచిగా మార్చే అవకాశం ఉంటుంది అని ఎవ్వరూ ఆలోచించరు. రోజులో జరిగిన చిన్న గొడవని హైలెట్ చేసి చూపిస్తారు. బిగ్బాస్ అనేది నిజంగా ఓ మాయలాంటింది.ఆ షో చూసి ఎవ్వరి స్వభావం గురించి ఒక ఐడియాకి వచ్చేయకండి. హౌస్ లో ఉండేవాళ్ళు అంతా ఒక్క కుక్కర్లో అన్నం వండుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఫుడ్ అందరికీ సరిపోదు. అలాంటి సందర్భాల్లో కూడా చిన్న చిన్న గొడవలు చోటు చేసుకుంటాయి.’ అంటూ కస్తూరి చెప్పుకొచ్చింది.
Most Recommended Video
మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!