హీరోయిన్ మాధవీలతకు పెళ్ళి.. నిజమేనా?

Advertisement

మహేష్ బాబు – సురేందర్ రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కిన ‘అతిధి’ చిత్రంలో హీరోయిన్ ఫ్రెండ్ గా నటించి మంచి పేరు తెచ్చుకుంది మాథవీలత. ఆ తరువాత తనీష్ హీరోగా వచ్చిన ‘నచ్చావులే’ చిత్రంతో పెద్ద హిట్ అందుకుంది. అంతేకాదు నేచురల్ స్టార్ నాని తో చేసిన ‘స్నేహితుడా’ చిత్రం కూడా బాగానే ఆడింది. అయితే ఆ చిత్రం తరువాత ఈమె నటించిన సినిమాలు అన్నీ ఫ్లాప్ అయ్యాయి.అటు పై అవకాశాలు కూడా రాలేదు.ఇలాంటి టైములో.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.కానీ ఇక్కడ కూడా ఈమె సక్సెస్ కాలేకపోయింది.

2019 ఎన్నికల్లో బిజెపి పార్టీ తరుపున గుంటూరు నుండీ పోటీ చేసిన మాథవీలత ఘోరంగా ఓడిపోయింది. ఇదిలా ఉండగా.. త్వరలోనే మాథవీ లత పెళ్ళి చేసుకోబోతుందన్న వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. “చాలా నెలల తరవాత నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను. కొత్త జీవితం మొదలైంది. మిరాకిల్ జరిగింది. నేను ఎప్పుడూ మిరాకిల్స్‌ను నమ్ముతాను.అందుకే చాలా.. చాలా.. చాలా.. సంతోషంగా ఉన్నాను. త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తాను’’ అంటూ మాధవీలత తన ఫేస్‌బుక్ లో పోస్ట్ పెట్టింది.

అయితే ఈమె పెట్టిన పోస్ట్.. నిజంగా పెళ్ళి గురించేనా..? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ఈ విషయం పై క్లారిటీ రావాల్సి ఉంది. గతంలో ఈమె ‘ప్రేమ’ సినిమాలో రేవతిలా చనిపోతనేమో.. టాబ్లెట్స్ ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది అంటూ పోస్ట్ పెట్టి అందరినీ కంగారు పెట్టింది. తరువాత ‘కంగారు పడాల్సింది ఏమీ లేదు.. నేను బాగానే ఉన్నాను’ అంటూ మరో పోస్ట్ పెట్టింది. అయితే టైం పాస్ కోసమే ఈ పోస్ట్ పెట్టిందా అని అప్పట్లో కొంతమంది విమర్శించారు. ఈసారి కూడా అలాంటి పోస్టే పెట్టిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.!

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read