Niharika: హాట్ టాపిక్ గా మారిన నిహారిక లేటెస్ట్ ఫోటో!

  • March 19, 2024 / 03:25 PM IST

మెగా డాటర్ నిహారిక (Niharika)  .. పరిచయం అవసరం లేని పేరు. నాగబాబు (Naga Babu) కూతురిగా సినీ రంగప్రవేశం చేసినప్పటికీ.. అంతకు ముందు షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్..లతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత టెలివిజన్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి ‘ఢీ’ వంటి పలు షోలకు మెంటర్ గా వ్యవహరించింది. హోస్ట్ గా కూడా మారి ఈమె నాగ చైతన్య వంటి హీరోలను ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే. కెమెరా అంటే భయం పోగొట్టుకోవడానికి ఆమె అలాంటి షోలలో పాల్గొన్నట్టు ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది.

ఇక హీరోయిన్ గా మారి (Oka Manusu)  ‘ఒక మనసు’ ‘హ్యాపీ వెడ్డింగ్’ ‘సూర్యకాంతం’ (Suryakantham)వంటి సినిమాల్లో కూడా నటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కోవిడ్ రావడం, ఈమెకి పెళ్లి ఫిక్స్ అవ్వడం జరిగింది. పెళ్ళైనప్పటికీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్లోనే ఉంటూ వచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్ళు ఈమె ఫ్యామిలీ లైఫ్ ను బాగానే ఎంజాయ్ చేసినప్పటికీ.. తర్వాత ఊహించని సంఘటనలు చోటు చేసుకోవడం వల్ల తన భర్త చైతన్య జొన్నలగడ్డతో విడాకులు తీసుకుంది.

ఇప్పుడు మళ్ళీ సినిమాల్లో బిజీ అవ్వాలని చూస్తుంది. ఓ పక్క వెబ్ సిరీస్..లు వంటివి నిర్మిస్తూనే మరోపక్క చిన్న సినిమాలను కూడా నిర్మిస్తుంది. ఇదిలా ఉండగా.. నిహారిక లేటెస్ట్ వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఇందులో ఆమె పెళ్లి కూతురిలా రెడీ అయ్యి చాలా అందంగా కనిపిస్తుంది. దీంతో ఈ వీడియో హాట్ టాపిక్ అవుతుంది అని చెప్పాలి.

షరతులు వర్తిస్తాయి సినిమా రివ్యూ & రేటింగ్!

‘డెవిల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?
‘బబుల్ గమ్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus