Bubblegum Collections: ‘బబుల్ గమ్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

  • March 16, 2024 / 11:09 PM IST

సుమ (Suma) కొడుకు రోషన్ కనకాల (Roshan Kanakala) హీరోగా ఎంట్రీ ఇస్తూ ‘బబుల్ గమ్’ (Bubblegum) అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ‘క్షణం’ (Kshanam) ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ వంటి వైవిధ్యమైన సినిమాలతో దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్న రవికాంత్ పేరేపు (Ravikanth Perepu) ఈ చిత్రానికి దర్శకుడు. మానస చౌదరి (Maanasa Choudhary) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థతో కలిసి ‘మహేశ్వరి మూవీస్’ సంస్థ నిర్మించింది. టీజర్, ట్రైలర్స్, పాటలు వంటివి బాగానే అనిపించాయి.

దీంతో డిసెంబర్ 29 న రిలీజ్ అయిన ఈ సినిమా పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. మొదటి రోజు ఈ సినిమాకి పర్వాలేదు అనిపించే టాక్ వచ్చింది. కానీ కలెక్షన్స్ మాత్రం నమోదు కాలేదు. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 0.21 cr
సీడెడ్ 0.08 cr
ఆంధ్ర(టోటల్) 0.14 cr
ఏపీ + తెలంగాణ 0.43 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా+ ఓవర్సీస్ 0.07 cr
వరల్డ్ వైడ్ టోటల్ 0.50 cr

‘బబుల్ గమ్’ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.4.75 కోట్ల షేర్ ను రాబట్టాలి.ఫుల్ రన్ ముగిసేసరికి ఈ మూవీ కేవలం రూ.0.50 కోట్ల షేర్ ను రాబట్టింది. అది కూడా నెగిటివ్ షేర్స్ వంటివి కాకుండా..! మొత్తంగా ఈ సినిమా 10 శాతం రికవరీ దగ్గరే ఆగిపోయి డిజాస్టర్ గా మిగిలింది.

రజాకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

లంబసింగి సినిమా రివ్యూ & రేటింగ్!
సేవ్ ది టైగర్స్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus