Poonam Pandey: ప్రముఖ మోడల్, నటి పూనమ్ పాండే కన్నుమూత.. ఆ వ్యాధితో!

బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా, మోడల్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న పూనమ్ పాండే 32 సంవత్సరాల వయస్సులో అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. గత కొన్ని సంవత్సరాలుగా పూనమ్ పాండే గర్భాశయ క్యాన్సర్ తో బాధ పడుతున్నారని చికిత్సకు కోలుకోలేక ఆమె మృతి చెందారని తెలుస్తోంది. పూనమ్ పాండే మరణవార్త తెలిసి ఆమె అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. పూనమ్ పాండే రియల్ అనే ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ నుంచి ఈ వార్తను పోస్ట్ చేయడంతో ఈ వార్త వెలుగులోకి వచ్చింది.

పూనమ్ పాండే మరణ వార్త గురించి తెలిసి ఫ్యాన్స్ బాధ పడుతున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ఆమె మృతికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించి ఆమె తుదిశ్వాస విడిచారని తెలుస్తోంది. పూనమ్ పాండే రియల్ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో ఈరోజు ఉదయం మమ్మల్ని ఎంతో బాధపెట్టే ఘటన చోటు చేసుకుందని పూనమ్ పాండే గర్భాశయ క్యాన్సర్ తో చనిపోయిందని తెలియజేయడానికి బాధ పడుతున్నామని పేర్కొన్నారు.

పూనమ్ పాండే తనకు పరిచయం ఉన్న ప్రతి ఒక్కరితో ఎంతో ప్రేమగా వ్యవహరించారని ఇతరుల విషయంలో ఆమె ఎంతో దయగా ఉండేవారని పోస్ట్ లో చెప్పుకొచ్చారు. పూనమ్ పాండే కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు దేవుడు మనో ధైర్యాన్ని ప్రసాధించాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

కెరీర్ పరంగా మంచి గుర్తింపును సొంతం చేసుకుంటున్న సమయంలో (Poonam Pandey) పూనమ్ పాండే మరణించినట్లు వస్తున్న వార్తలు ఇండస్ట్రీ వర్గాలను సైతం షాక్ కు గురి చేస్తున్నాయి. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus