2023 Rewind: 2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

గత రెండుమూడేళ్లలో చాలా మంది కొత్త కథానాయికలు వెండితెరపై తమ సత్తాను చాటుకున్నారు. అయితే.. 2023లో చాలా మంది హీరోయిన్లు పరిచయమైనప్పటికీ.. వారెవరూ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. 2023లో అలరించిన హీరోయిన్లలో ఒకే ఒక్క కొత్త ఎంట్రీ ఉండడం గమనార్హం. మరి వాళ్లెవరో చూసేద్దామ్..!!

1. సంయుక్త మీనన్ – విరూపాక్ష & డెవిల్

ఈ ఏడాది మొదట్లోనే “విరూపాక్ష”లో నెగిటివ్ సైడ్ ఉన్న క్యారెక్టర్లో ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచింది. అంతకు ముందు వరకూ ఆమెకు సరిగా నటించడం రాదని, హావభావాలు పండించలేదని గేలి చేసినవాళ్ళందరూ నోరు మూసేశారు. ఇక రీసెంట్ గా డెవిల్ చిత్రంలోనూ చక్కని నటనతో అలరించి, ఈ ఏడాది టాప్ హీరోయిన్ గా నిలిచింది సంయుక్త మీనన్.

2. కీర్తిసురేష్ – దసరా

“మహానటి” తర్వాత కీర్తి సురేష్ బోలెడన్ని సినిమాలు చేసినప్పటికీ.. నటిగా ఆమె పొటెన్షియల్ ను యూటిలైజ్ చేసుకున్నా సినిమాలు మాత్రం ఏవీ లేవు. అందువల్ల ఆమెకు సరైన హిట్ కూడా దొరకలేదు. ఆమధ్య వచ్చిన “చిన్ని” మాత్రం కాస్త పర్వాలేదనిపించుకుంది. కానీ.. “దసరా” మాత్రం ఆమెలోని నటిని పూర్తిస్థాయిలో వినియోగించుకుంది. ముఖ్యంగా ఆమె డ్యాన్స్ అయితే.. ట్రెండ్ అయ్యింది కూడా.

3. వైష్ణవి చైతన్య – బేబీ

ఈ ఏడాది మోస్ట్ సెన్సేషనల్ మూవీ “బేబీ”లో టైటిల్ రోల్ ప్లే చేసిన వైష్ణవి చైతన్య, క్యారెక్టర్ కు న్యాయం చేయడమే కాదు.. చక్కని హావభావాలతో అలరించింది. కొన్ని బోల్డ్ సీన్స్ లో మొహమాటపడకుండా ఆమె నటించిన తీరుకు కొందరు ఆశ్చర్యపోయారు కూడా. అయితే.. ఈ సినిమా కొంతమేరకు ఆమెకు చేసిన డ్యామేజ్ ను ఆమె డీల్ చేసిన విధానం మాత్రం ప్రశంసనీయం.

4. కావ్య కళ్యాణ్ రామ్ – బలగం & ఉస్తాద్

గతేడాది “మసూద”లో హీరోయిన్ గా నటించినప్పటికీ.. కావ్య కళ్యాణ్ రామ్ కు సరైన గుర్తింపు రాలేదు. కానీ.. బలగం, ఉస్తాద్ చిత్రాల్లో ఆమె చాలా ఈజ్ భలే ఆకట్టుకుంది. కావ్య సినిమాలు ఎంచుకుంటున్న తీరు కూడా అభినందనీయం. ఎక్కడా అసభ్యతకు తావు ఇవ్వకుండా.. సినిమాకు అవసరమైన మేరకు లిప్ లాక్స్ తో ఆమె చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. తెలుగు హీరోయిన్ గా ఆమె మంచి స్థాయికి చేరుకొనే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

5. మాళవిక నాయర్ – అన్నీ మంచి శకునములే

“ఎవడే సుబ్రమణ్యం” తన మొదటి సినిమా అయినప్పటికీ.. మాళవిక నాయర్ నటన & స్క్రీన్ ప్రెజన్స్ కు మంచి మార్కులు పడ్డాయి. అయితే.. ఆ తర్వాత మాత్రం ఎందుకో ఆమెకు సరైన క్యారెక్టర్ పడలేదు. చాన్నాళ్ల తర్వాత 2023లో మాళవికకు మంచి క్యారెక్టర్ పడింది. ఇండిపెండెంట్ ఉమెన్ గా ఆమె నటన అందర్నీ ఆకట్టుకుంది.

6. పాయల్ రాజ్ పుత్ – మంగళవారం

పాయల్ వద్దనుకున్నా ఒక బ్రాండ్ లో ఇరుక్కుపోయింది. ఆమెలోని నటిని జనాలు చూడడం ఎప్పుడో మానేశారు. ఎంతసేపూ ఆమెను ఒక గ్లామర్ డాల్ లానే చూస్తున్నారు. అయితే.. ఆ ఇమేజ్ ను అలాగే కంటిన్యూ చేస్తూ, తనలోని నటిని “మంగళవారం” చిత్రంతో పరిచయం చేసింది పాయల్. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.

7. మృణాల్ ఠాకూర్ – హాయ్ నాన్న

తెలుగులో మొదటి సినిమా “సీతారామం”తోనే అశేషమైన దక్షిణాది ప్రేక్షకుల్ని సంపాదించుకున్న (Mrunal Thakur) మృణాల్ ఠాకూర్.. రెండో సినిమా “హాయ్ నాన్న”తోనూ అదే స్థాయిలో ఆకట్టుకొంది. అందం, అభినయ సామర్ధ్యం సమపాళ్లలో కలిగిన ఈ సుందరాంగి.. సీనియర్ హీరోలతోనూ జతకట్టగలిగే వయసులో ఉండడం ఆమెకు మంచి ప్లస్ పాయింట్. సరిగ్గా టాలీవుడ్ మీద కాన్సన్ ట్రేట్ చేస్తే ఆమె ఇక్కడ స్టార్ హీరోయిన్ గా ఎదగడం ఖాయం.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus