Pragathi: రెండోవ పెళ్లి వార్తలపై షాకింగ్ కామెంట్స్ చేసిన నటి ప్రగతి

Advertisement

నటి ప్రగతి అటు సినిమాలలోనూ, ఇటు సాంఘీక మాధ్యమంలోనూ చురుకుగా ఉంటూ వుంటారు. అలాగే ఈమధ్య సాంఘీక మాధ్యమాల్లో తను బరువులు ఎత్తి మహిళలు కూడా పురుషులతో సమానంగా ఏదైనా చెయ్యగలరు అని నిరూపించి చూపించారు. అలాగే కొన్ని పోటీల్లో కూడా పాల్గొన్నారు అని తెలిసింది. ఈమధ్య శ్రీకాకుళం జిల్లా రాజాం లో జరిగిన మహిళల వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని బహుమతి కూడా గెలుచుకున్నారని తెలిసింది. అటు నటన, ఇటు తనకున్న అభిరుచి ఇలా రెండిటినీ సమతుల్యంగా చేసుకుంటూ వస్తున్న నటి ప్రగతి మీద ఈమధ్య కొన్ని వార్తలు వచ్చాయి.

దానికి ఆమె చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని వెబ్ మీడియాలలో ప్రగతి ఒక నిర్మాతని రెండో వివాహం చేసుకున్నారు అని రాసారు. ఇలా వచ్చిన వార్తల మీద ఆమె మాట్లాడుతూ, “అలాంటి వార్తలు చూడగానే చాలా బాధ వేసింది. ఆలా ఎలా రాస్తారు, ముందుగా అడగాలి కదా, ఆధరాలు లేకుండా ఆలా రాయటం బాధ్యతా రాహిత్యం అవుతుంది. ఒకరి వ్యక్తిగత జీవితం గురించి ఆలా రాయడం తప్పు, నేను నటిని కదా అని మీ ఇష్టం వచ్చినట్టు రాస్తే నేను వాటిని ఖండిస్తున్నాను.

ఇకముందు మీరు రాయాలని అనుకున్నప్పుడు అడిగి తెలుసుకొని రాయండి,” అని చెప్పారు ప్రగతి. ఇలాంటివి ఏమైనా ఉంటే, తాను మీడియా వాళ్ళతోటే ముందుగా షేర్ చేసుకుంటాను అని, ఇలాంటివి రాయటం వలన, తన ఆత్మగౌరవానికి భంగం కలుగుతుందని చెప్పారు ప్రగతి. ఒకరి వ్యక్తిగత జీవితం గురించి ఇలా హద్దులు దాటి రాయకూడదు అని, ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పారు. ప్రగతి ఇప్పుడు తెలుగు, తమిళ సినిమాల్లో బిజీగా వున్నారు. ఈ సంవత్సరం చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ సినిమాలో ఆమె నటించారు.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news