సీనియర్ నటి ప్రగతి నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్‌లో కొనసాగుతున్న ఈమె.. సోషల్ మీడియాలో మాత్రం స్టార్ హీరోయిన్ల రేంజ్లో చలామణి అవుతుంది. లాక్ డౌన్ టైం నుండి ప్రగతి తనలోని కొత్త యాంగిల్ ను బయటపెట్టింది. సినిమాల్లో జస్ట్ అలా మూలాన నిలబడే పాత్రల్లోనో లేక ఏడుస్తూ కనిపించే పాత్రల్లోనే నటించేది ప్రగతి. అలాంటి ఆమె బులెట్ బండి తోలడం, జిమ్ లో వర్కౌట్లు చేసే ఫోటోలు, వీడియోలు షేర్ చేయడం, మాస్ పాటలకి డాన్సులు ఇరగదీయడం ఇలాంటివి చాలా చేసి..
అందరికీ కొత్త ప్రగతిని (Pragathi) పరిచయం చేసింది. ఆ తర్వాత ఈమె చాలా ఇంటర్వ్యూల్లో దర్శనమిచ్చింది. అన్ని ఇంటర్వ్యూలలోనూ కెరీర్ ప్రారంభంలో ఆమె ఎదుర్కొన్న సమస్యలను చేదు అనుభవాలను చెప్పుకొస్తుంటుంది ఈ బ్యూటీ. గతంలో క్యాస్టింగ్ కౌచ్ వేధింపులకు గురయ్యాను అంటూ ప్రగతి చేసిన కామెంట్స్ ఎవ్వరూ మర్చిపోలేరు. అందులోనూ ఓ స్టార్ కమెడీయన్ ‘తనతో చాలా బాగా ఉంటూనే .. తనతో ఓ రోజు మిస్ బిహేవ్ చేశాడని ఆమె చెప్పుకొచ్చింది.
అతని పేరు మాత్రం బయటపెట్టలేదు. అది తన జీవితంలో ఓ చేదు అనుభవం అంటూ ఆమె చెప్పుకొచ్చింది. అది ఇప్పటికీ తన మైండ్లో నుండి పోవట్లేదు అని ప్రతిసారి చెబుతూనే ఉంది. ఆ రోజు నుంచి తనకు ఎలాంటి పని చేయాలనిపించలేదట, ఆ రోజు భోజనం, టీ వంటివి కూడా మానేసాను అని చెబుతూనే ఉంది. కానీ ఆ స్టార్ కమెడియన్ ఎవరు అనే విషయాన్ని మాత్రం ఈమె బయటపెట్టడం లేదు.
టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!