సంజయ్ దత్‌తో పార్టీ చేసుకున్న ‘ఇడియట్’ హీరోయిన్ రక్షిత.. వైరల్ అవుతున్న ఫోటోలు..

  • February 6, 2023 / 07:25 PM IST

సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రిటీల గురించిన అన్ని విషయాలు జనాలకు తెలిసిపోతున్నాయి. సామాజిక మాధ్యమాల వాడకం అనేది మనిషి రోజు వారీ జీవితంలో ఓ భాగమైపోయింది.. స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్‌లో అకౌంట్ ఉంటే చాలు.. ప్రపంచం నలుమూలలా ఏం జరుగుతుందో క్షణాల్లో తెలిసిపోతుంది.. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్‌తో కలిసి రవితేజ ‘ఇడియట్’ హీరోయిన్ పార్టీ ఎంజాయ్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సంజయ్ దత్‌తో పాటు మరికొంత మంది సన్నిహితులతో హ్యాపీగా పార్టీ చేసుకుంటూ.. ఫుల్‌గా చిల్ అవుతూ కనిపించింది రక్షిత. ఖల్ నాయక్‌ని కలవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు షేర్ చేసింది. సంజయ్ దత్ లవ్లీ పర్సన్ అంటూ కామెంట్స్ చేసింది. ‘కె.జి.యఫ్ – చాప్టర్ : 2’ తో సంజయ్ దత్ కన్నడ ఇండస్ట్రీలోకి ఎంటరైన సంగతి తెలిసిందే.

‘అధీరా’ క్యారెక్టర్‌లో క్రూరమైన గెటప్‌లో ఆయన నటన ఆకట్టుకుంది. రక్షిత శాండల్ వుడ్ డైరెక్టర్ ప్రేమ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరంగా ఉంటుంది. వీరికి ఓ బాబు ఉన్నాడు. అడపాదడపా కన్నడంలో టీవీ షోలలో కనిపిస్తుందామె..

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus