టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సమంత ప్రస్తుతం సినిమాలకు ఏడాది పాటు విరామం ఇవ్వబోతున్నారు. ఈమె గతంలో మయోసైటిస్ వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. ఆరు నెలలపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ చికిత్స తీసుకున్నటువంటి సమంత తిరిగి తన సినిమా పనులలో బిజీ అయ్యారు. అయితే తనకు ఈ వ్యాధి పూర్తిగా నయం కాలేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు సమంత కమిట్ అయినటువంటి సినిమాలు అన్నింటిని కూడా పూర్తిచేసి ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.
ఇలా ఏడాది పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉండి పూర్తిగా చికిత్స చేయించుకోనీ కోలుకున్న తర్వాత తిరిగి ఇండస్ట్రీలో బిజీ కాబోతున్నానని ఈమె తెలియజేసారు. ఇక ఈ విషయం తెలిసి అభిమానులు కాస్త ఆందోళన చెందిన ఆమె క్షేమంగా ఉండాలని కోరుకున్నారు. ఇలా సమంత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ తన బిజినెస్ ను ప్రమోట్ చేసుకోవడంలో మాత్రం వెనకడుగు వేయలేదు.
సమంత కొంతకాలంగా సాకీ బ్రాండ్ కు సంబంధించిన క్లాత్ బిజినెస్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక్కడ ఉమెన్స్ కిడ్స్ వేర్ అన్ని కూడా అందుబాటులో ఉంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా తన బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇలా సమంత అనారోగ్యంగా ఉన్నప్పటికీ తన వ్యాపారాలను మాత్రం ముందుకు నడిపించడం కోసం కృషి చేస్తున్నారు.
ఇకపోతే సమంత (Samantha) బిజినెస్ ద్వారా వచ్చే లాభాలు అన్నింటిని కూడా తన ఫౌండేషన్ కోసం ఉపయోగించడం అలాగే సోషల్ మీడియా కార్యకలాపాల కోసం ఉపయోగిస్తూ ఉంటారట. ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే సమంత ఖుషి సినిమా తో పాటు సిటాడెల్ అనే వెబ్ సిరీస్లో నటించి షూటింగ్ కంప్లీట్ చేసుకున్నారు త్వరలోనే ఈమె చికిత్స కోసం అమెరికా వెళ్లబోతున్నారు.
హాస్టల్ డేస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
మహావీరుడు సినిమా రివ్యూ & రేటింగ్!