గాయాలపాలైన ప్రముఖ నటి సన..!

ప్రముఖ టాలీవుడ్ నటి సన అందరికీ సుపరిచితమే.ఇటీవల ఈమె గాయాలు పాలైనట్టు తెలుస్తుంది.అంతేకాదు ఈమెకు సర్జెరీ కూడా జరిగిందట. షూటింగ్లో భాగంగా ఈమె చేతికి గాయం అయినట్టు సమాచారం. అంతేకాదు సర్జెరీ కూడా చేసారని వినికిడి. ప్రస్తుతం ఈమె బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారు. టెన్షన్ పడాల్సిన అవసరం లేదని త్వరలోనే ఈమె కోలుకుంటుందని ఈమె సన్నిహితులు తెలియజేసారు. తెలుగుతో పటు తమిళ, కన్నడ భాషల్లో కలుపుకుని 600 కి పైగా చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు సన.

25 సంవత్సరాలుగా ఆమె ఇండస్ట్రీలో ఉన్నారు. ‘అలౌకిక’ వంటి సీరియల్ లో కూడా ఈమె నటించిన సంగతి తెలిసిందే. కొన్నాళ్ళుగా ఈమె సోషల్ మీడియాలో కూడా ఈమె యాక్టివ్ గా ఉంటూ వస్తోంది. 50 ఏళ్ళ వయసులో కూడా గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే కొద్దిరోజులుగా ఈమె సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించడం లేదు. ఆరా తీస్తే ఇది విషయం అని తెలిసిందే. సన పూర్తి పేరు షానూర్ సనా బేగం.

ఈమె ఓ మోడల్ అన్న సంగతి బహుశా ఎక్కువ మందికి తెలిసి ఉండకపోవచ్చు. దూరదర్శన్లో ప్రసారమయ్యే ‘రుద్రమదేవి’ అనే ధారావాహిక ద్వారా ఈమె నటిగా పరిచయమైంది. 1996 వ సంవత్సరంలో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన ‘నిన్నే పెళ్లాడతా’ సినిమా ద్వారా ఈమె వెండితెరకు పరిచయమైంది. ఆ చిత్రంలో ఈమె హీరో నాగార్జునకి వదిన పాత్రని పోషించింది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33


Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus