Shriya: హీరోయిన్ శ్రియ సంచలన వ్యాఖ్యలు.. నా సమస్య కాదంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోయిన్లలో శ్రియ ఒకరు కాగా సుధీర్ఘకాలంగా హీరోయిన్ గా విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తున్న శ్రియ తాజాగా ఒక సందర్భంలో చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లను, మహిళా నటులను పనికిమాలిన వ్యక్తులుగా చూస్తారని ఆమె తెలిపారు. ఇప్పటికీ ఇది జరుగుతూనే ఉందని ఆమె కామెంట్లు చేశారు. కొన్ని మాటలు విన్న సమయంలో బాధేస్తుందని శ్రియ చెప్పుకొచ్చారు. అలాంటి కామెంట్లు విన్న సమయంలో వాటిని మరిచిపోయి పాత స్నేహితుల దగ్గరకు వెళ్లి సంతోషంగా గడుపుతానని శ్రియ కామెంట్లు చేశారు.

నా భర్త చూసి నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావని కామెంట్లు చేస్తాడని ఆమె చెప్పుకొచ్చారు. మరీ ఇంతలా ఎవరూ ఆలోచించరేమో అంటూ ఓదారుస్తూ ఉంటాడని శ్రియ కామెంట్లు చేశారు. కానీ ఆ కామెంట్లు చూసిన సమయంలో ఫీల్ కాకుండా ఉండలేమని ఆమె చెప్పుకొచ్చారు. ఇప్పుడు నేను ఒక తల్లినని నా భర్త, కూతురుతో కలిసి బయటకు వెళ్లిన సమయంలో నన్ను చూసి జనాలు కూడా ఏదో ఒకటి అంటారని శ్రియ వెల్లడించారు.

నేను నాకు నచ్చిన డ్రెస్ ను మాత్రమే వేసుకుంటానని నాకు ఏ డ్రెస్ ఇష్టమైతే దానినే ధరిస్తానని ఆమె చెప్పుకొచ్చారు. నేను మంచిదాన్ని అనే విషయం నాకు తెలుసని ఆమె కామెంట్లు చేశారు. ఇండస్ట్రీలో ఉన్నందుకు మా గురించి ఏమనుకుంటున్నారు? ఎలా చూస్తున్నారనేది నా సమస్య కాదని ఆమె వెల్లడించారు. శ్రియ నటించిన షో టైమ్ అనే వెబ్ సిరీస్ మార్చి నెల 8వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.

శ్రియ (Shriya) ఈ వెబ్ సిరీస్ తో భారీ సక్సెస్ ను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది. శ్రియ వచ్చిన ప్రతి ఆఫర్ ను సద్వినియోగం చేసుకుంటూ విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. శ్రియ రెమ్యునరేషన్ పరిమితంగా ఉండటంతో ఆమెకు ఎక్కువ ఆఫర్లు ఇవ్వడానికి దర్శకనిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు.

పవర్ స్టార్ నిజంగానే రూ.100 కోట్ల ఆస్తులు అమ్మారా.. ఏమైందంటే?

‘ఆపరేషన్ వాలెంటైన్’ సెన్సార్ రివ్యూ వచ్చేసింది.. రన్ టైమ్ ఎంతంటే?
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus