Operation Valentine Censor Review: ‘ఆపరేషన్ వాలెంటైన్’ సెన్సార్ రివ్యూ వచ్చేసింది.. రన్ టైమ్ ఎంతంటే?

Ad not loaded.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘ఆపరేషన్ వాలెంటైన్’. తెలుగు-హిందీలో అంటే బైలింగ్యువల్ మూవీగా ‘ఆపరేషన్ వాలెంటైన్’ తెరకెక్కింది. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ‘సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్’, ‘సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్’ వారు నిర్మించగా, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ (వకీల్ ఖాన్), నందకుమార్ అబ్బినేని సహ నిర్మాతగా వ్యవహరించారు. మానుషి చిల్లర్ ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమవుతుంది.

రుహాని శర్మ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించింది. మార్చి 1న ఈ సినిమా (Operation Valentine) రిలీజ్ కాబోతుంది. టీజర్, ట్రైలర్స్ కి మంచి రెస్పాన్స్ లభించింది. తాజాగా సెన్సార్ పనులు కూడా పూర్తయ్యాయి. ఈ చిత్రానికి సెన్సార్ వారు యు/ఎ సర్టిఫికెట్ ను జారీ చేశారు. ఇక ఈ చిత్రం రన్ టైం 124 నిమిషాలుగా ఉంటుందట. చెప్పాలంటే ఇది క్రిస్ప్ రన్ టైంగా చెప్పుకోవాలి. ఇలాంటి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలకి రన్ టైం తక్కువగా ఉండటమే మంచిది.

అప్పుడే బోర్ కొట్టకుండా ఉంటుంది. వాలెంటైన్స్ డే రోజున జరిగిన పుల్వామా దాడి, దానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పగ తీర్చుకున్న తీరు వంటి థీమ్ తో తెరకెక్కిన సినిమా ఇది.విజువల్స్ అద్భుతంగా ఉన్నాయట, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా హైలెట్ అని అంటున్నారు. ‘ఆపరేషన్ వాలెంటైన్’ తో వరుణ్ తేజ్..బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే మెగా హీరోలు అల్లు అర్జున్, రాంచరణ్..లు బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు. మరి వరుణ్ తేజ్ వారిలానే అక్కడ సక్సెస్ అవుతాడేమో చూడాలి.

జీవితంలో నేను కోరుకునేది ఇది మాత్రమే.. శోభిత చెప్పిన విషయాలివే!

‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus