Actress: పెళ్లి అవసరం లేదు.. కానీ పిల్లలు కావాలి : టబు

  • July 31, 2023 / 01:58 PM IST

టబు.. తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలందరితో నటించింది. నాగార్జున హీరోగా నటించిన ”నిన్నే పెళ్లాడతా” సినిమాతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఆ సినిమా తర్వాత ఆమెకు వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి. దాంతో అప్పట్లో ఆమె డేట్స్ కోసం నిర్మాతలు ఎదురు చూసే వారు. టబు అందం.. అభినయం.. తో కుర్రకారు కలల రాణిగా మారిపోయింది. అయితే ఏజ్ బార్ అవుతున్న కొద్ది ఆమెకు అవకాశాలు తగ్గాయి.

దాంతో టబు (Actress) బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. అక్కడ అడపాదడపా సినిమాలు చేసింది. ప్రస్తుతం తల్లి పాత్రలు చేస్తూ బిజీగా ఉంది. అయితే ప్రస్తుతం ఈ అమ్మడు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.తాజాగా ఓ ఇంటర్వ్యూలో పెళ్లి, గర్భంపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పెళ్లి గురించి మాట్లాడుతూ..” నాకు నచ్చిన వాడు ఇంకా దొరకలేదు.. అందుకే నేను ఇంకా వివాహం చేసుకోలేదు.

నన్ను మంచిగా చూసుకుని, నాకు గౌరవం ఇచ్చేవాడు దొరికితే అప్పడు పెళ్లి చేసుకుంటాను. అదీ కాక పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతామా? అంటూ రివర్స్ క్వశ్చన్ వేసింది. ప్రస్తుతం నాకూ తల్లి అవ్వాలని ఉందని.. దానికి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదని బాంబు పేల్చింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో వైద్య పద్దతులు దానికి అందుబాటులో ఉన్నయని తెలిపారు. సరోగసి విధానం ద్వారా కూడా పిల్లల్ని కనొచ్చు అని ఆమె అభిప్రాయ పడ్డారు.

ప్రస్తుతం నేను కెరీర్ ను ఆస్వాదిస్తున్నాను”. అని అన్నారు. ఇక ఈ వయసులో పెళ్లి, పిల్లలు అనే విషయాలు మీకు సమస్య కాదా? అని అడగ్గా..” నేటి సమాజంలో వయస్సు అనేది ఒక నెంబర్ గానే చూస్తున్నారు. ఏజ్ దేనికీ అడ్డంకి కాదు అని సమాధానం ఇచ్చారు. ఈ మధ్యకాలంలో టబు పెద్ద పెద్ద సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ బిజీగా ఉంటోంది. ఆమె ప్రస్తుతం హిందీలో, తమిళంలో పలు సినిమాలతో బిజీగా ఉంది.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus