Biggest Movies: హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

  • July 29, 2023 / 04:03 PM IST

పెద్ద సినిమాలు అన్నాక.. ముందుగానే నిర్మాతలని, బయ్యర్లను.. సేఫ్ జోన్లో ఉంచేలా చేస్తాయని అంతా భావిస్తుంటారు.కానీ అది పూర్తిగా నిజం కాదు. 70 శాతం బిజినెస్ అవుతుందేమో.. అంతే..! బజ్ లేకుండా పెద్ద సినిమా అయినా గట్టెక్కడం కష్టమే.! అది కొన్ని సినిమాల విషయంలో నిజమైంది. టాలీవుడ్లో కొన్ని సినిమాలు బజ్ లేకుండా రిలీజ్ అయ్యాయి. వాటిలో చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. మరికొన్ని సినిమాలకి పాజిటివ్ టాక్ వచ్చినా బ్లాక్ బస్టర్ స్టేటస్ ను దక్కించుకోలేకపోయాయి. లిస్ట్ లో ఉన్న ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) రభస :

ఎన్టీఆర్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2014 ఆగస్టులో రిలీజ్ అయ్యింది. మొదటి నుండి ఈ సినిమాపై ఎలాంటి బజ్ లేదు. ఇక రిలీజ్ అయిన వీకెండ్ కే ఈ మూవీ దుకాణం సర్దేసింది. పెద్ద డిజాస్టర్ అయ్యింది.

2) బ్రహ్మోత్సవం :

మహేష్ బాబు – శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లో రూపొందిన ఈ మూవీ మొదటి నుండి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేదు. పైగా దర్శకుడు, హీరోల మధ్య గొడవలు వచ్చినట్టు ప్రచారం జరిగింది. ఇక 2016 మే లో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేక డిజాస్టర్ లిస్ట్ లో చేరిపోయింది.

3) ధృవ :

మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పై విడుదలకు ముందు అంతగా బజ్ ఏర్పడలేదు. ‘తని ఒరువన్’ కి రీమేక్ గా తెరకెక్కిన ‘ధృవ’ విడుదలకి ముందు రాంచరణ్ ప్లాపుల్లో ఉన్నాడు. అయినప్పటికీ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద యావరేజ్ ఫలితాన్ని రాబట్టుకుంది. ఆ టైంలో రూ.500,రూ.1000 నోట్లు రద్దవ్వడం కూడా ఈ సినిమాకి మైనస్ అయ్యిందని చెప్పొచ్చు.

4) కాటమరాయుడు :

పవన్ కళ్యాణ్ హీరోగా డాలి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ కూడా ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.పైగా ‘వీరం’ చిత్రం ఆల్రెడీ తెలుగులో డబ్ అవ్వడం.. అది ‘జీ తెలుగు’ ‘జీ సినిమాలు’ వంటి ఛానల్స్ లో చాలా సార్లు టెలికాస్ట్ అవ్వడంతో ‘కాటమరాయుడు’ పై బజ్ ఏర్పడలేదు. అందుకే ఈ మూవీ కూడా ప్లాప్ అయ్యింది.

5) స్పైడర్ :

మహేష్ బాబు – మురుగదాస్ కాంబినేషన్లో రూపొందిన ఈ మూవీ టీజర్, ట్రైలర్ అన్నీ కూడా తమిళ ఆడియన్స్ టేస్ట్ కి తగ్గట్టు ఉన్నాయి.తెలుగు నేటివిటీ కంప్లీట్ గా మిస్ అయ్యింది. ప్రమోషనల్ కంటెంట్ తెలుగు ప్రేక్షకులను కనీసం ఆకట్టుకోలేదు. అందుకే ఈ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది.

6) ఆఫీసర్ :

నాగార్జున – రాంగోపాల్ వర్మ కాంబినేషన్లో రూపొందిన ఈ మూవీ కూడా విడుదలకు ముందు హైప్ క్రియేట్ అవ్వలేదు. అందుకే ఈ సినిమా ఎపిక్ డిజాస్టర్ గా మిగిలింది.

7) నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా :

అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకుడిగా మారుతూ చేసిన ఈ సినిమా పై మినిమమ్ బజ్ కూడా ఏర్పడలేదు. అందుకే మొదటి షోతోనే ఈ మూవీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.

8) ఎన్టీఆర్ మహానాయకుడు :

‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ప్లాప్ కావడంతో దానికి పార్ట్ 2 గా వచ్చిన ఈ సినిమా పై మినిమమ్ బజ్ కూడా ఏర్పడలేదు. అందుకే ఈ సినిమా కూడా ఎపిక్ డిజాస్టర్ గా మిగిలింది.

9) ఆచార్య :

మెగాస్టార్ చిరంజీవి – మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమా పై విడుదలకి ముందు అంచనాలు పెద్దగా ఏర్పడలేదు. ఇక సినిమా కూడా అలాగే ఉండటంతో పెద్ద డిజాస్టర్ అయ్యింది.

10) గాడ్ ఫాదర్ :

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ కూడా కీలక పాత్ర పోషించాడు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’ కి రీమేక్ గా ఈ సినిమా రూపొందింది. అయితే ఒరిజినల్ ఆల్రెడీ తెలుగులో డబ్ అయ్యి రిలీజ్ అవ్వడంతో ‘గాడ్ ఫాదర్’ పై బజ్ ఏర్పడలేదు. కానీ ఈ సినిమా (Biggest Movies) యావరేజ్ ఫలితాన్ని అందుకుంది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus