Tamanna: 17 ఏళ్ల కెరీర్ లో మిల్కీ బ్యూటీ ఎంత సంపాదించిందంటే..?

  • January 4, 2023 / 03:18 PM IST

సాధారణంగా ఇండస్ట్రీలో ఉన్న హీరోల ఆస్తుల గురించి మాట్లాడుతుంటారు కానీ హీరోయిన్ల గురించి పెద్దగా మాటలు రావు. అయితే ఇప్పుడు మిల్కీ బ్యూటీ తమన్నా ఎంత సంపాదించిందో తెలుసుకుందాం. 2007లో ‘హ్యాపీ డేస్’ సినిమాతో పాపులర్ అయిన తమన్నా.. మెల్లగా స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. 17 ఏళ్ల తన సినీ కెరీర్ లో ఎక్కడా డౌన్ ఫాల్ అనేది లేకుండా దూసుకుపోతుంది. ఇప్పుడు ఆమె వయసు 33 ఏళ్లు. ఇప్పటికీ వరుస అవకాశాలుదక్కించుకుంటుంది .

సినిమాలతో పాటు పలు ప్రొడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. లెక్క ప్రకారం ఆమె వార్షిక ఆదాయం ప్రస్తుతం రూ.12 కోట్లు ఉంటుందని సమాచారం. అంటే నెలకి కోటి రూపాయలన్నమాట. ఇప్పటివరకు ఆమె వెనకేసిన ఆస్తుల విలువ రూ.110 కోట్లకు పైమాటే అని అంటున్నారు. తమన్నా ఇదివరకు ఒక్కో సినిమాకి రూ.2 నుంచి రూ.3 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకునేది. అలానే ఐటెం సాంగ్ చేయాలంటే రూ.70 లక్షలకు పైగా ఛార్జ్ చేసేది.

ఐపీఎల్ ప్రారంభోత్సవ వేడుకలో పది నిమిషాల పాటు డాన్స్ చేయడానికి ఆమెకి దాదాపు యాభై లక్షలు ఇచ్చారు. 2015లో ఈ బ్యూటీ ఒక బంగారు దుకాణం కూడా మొదలుపెట్టింది. తమన్నాకు ముంబైలోని వెర్సోవాలో రూ 16 కోట్లు విలువ చేసే లగ్జరీ ఫ్లాట్, లాండ్ రోవర్ డిస్కవరీ, బీఎండబ్ల్యూ 5 సిరీస్, బెంజ్ కార్లు ఉన్నాయి. ఆమె వాడే చానల్ బ్రాండ్ హ్యాండ్ బ్యాగ్ ధరే రూ 3 లక్షల వరకు ఉంటుంది. అలానే ఆమె దగ్గర అరుదైన ఒక డైమండ్ ఉంది.

దాని విలువ దాదాపు రెండు కోట్లు. ఆ డైమండ్ ని ఉపాసన.. తమన్నాకు గిఫ్ట్ గా ఇచ్చింది. మొత్తానికి తమన్నా తన కెరీర్ లో బాగానే సంపాదించిందని చెప్పుకోవాలి.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus