ఆది సాయికుమార్ ప్రెస్టీజియస్ మూవీ ‘అమరన్‌ ఇన్‌ ది సిటీ-చాప్టర్‌ 1’ షూటింగ్ ప్రారంభం!

‘లవ్ లీ’ స్టార్ ఆది సాయికుమార్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా ‘అమరన్‌ ఇన్‌ ది సిటీ-చాప్టర్‌ 1’. ఈ ప్రెస్టీజియస్ మూవీని నిర్మాత ఎస్ వీ ఆర్ నిర్మిస్తున్నారు. ఆది పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అవికా గోర్ నాయికగా నటిస్తోంది. సిల్వర్ స్క్రీన్ పై ఇప్పటి వరకు రాని కొత్త కథా నేపథ్యంతో ‘అమరన్‌ ఇన్‌ ది సిటీ-చాప్టర్‌ 1’ సినిమాను రూపొందిస్తున్నారు డెబ్యూ డైరెక్టర్ ఎస్ బాలవీర్.

రెండేళ్లపాటు ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి పక్కా ప్లానింగ్ తో షూటింగ్ కు రెడీ అయ్యింది ‘అమరన్‌ ఇన్‌ ది సిటీ-చాప్టర్‌ 1’ సినిమా. ‘అమరన్‌ ఇన్‌ ది సిటీ-చాప్టర్‌ 1’ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవల హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఈ ఫస్ట్ షెడ్యూల్ లో భారీ ఖర్చుతో నిర్మించిన పోలీస్ సెట్ లో షూటింగ్ చేస్తున్నారు. దీంతో పాటు నగర పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరపనున్నారు. ఆది సాయి కుమార్ సరికొత్త లుక్ లో కనిపించనున్న ఈ చిత్రంలో గ్రాఫిక్స్ కు ప్రాధాన్యత ఉండబోతోంది.

సాయి కుమార్, ఆదిత్య ఓం, కృష్ణుడు, మనోజ్‌ నందన్‌, వీర శంకర్, అయన్, శృతి, రోషన్, మధు మణి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: ఎస్‌.బాల‌వీర్‌, నిర్మాత: ఎస్‌వీఆర్‌, సమర్పణ: జెమిని, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : గిరిధర్ మామిడిపల్లి, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ : లక్ష్మణ్ స్వామి, నాగ మధు, సంగీతం: కృష్ణ చైతన్య, సినిమాటోగ్రఫీ: ఆర్.ఆర్ విష్ణు , లైన్‌ ప్రొడ్యూసర్‌: శ్వేతా కటకం, పబ్లిసిటీ డిజైనర్‌: కడియం వెంకట్‌, పి.ఆర్‌.ఓ: సాయి సతీశ్‌, పర్వతనేని రాంబాబు

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus