Adipurush Collections: ‘ఆదిపురుష్’ 11 రోజుల కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే..?

  • June 27, 2023 / 07:42 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆదిపురుష్’. కృతి సనన్ హీరోయిన్ గా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ మైథలాజికల్ మూవీని ‘టి సిరీస్ ఫిలిమ్స్’ ‘రిట్రోఫిల్స్ బ్యానర్ల పై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ కలిసి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్, వంటి వారు కూడా కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ జూన్ 16 న ఈ చిత్రం హిందీ, తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఏకకాలంలో విడుదలయ్యింది.

హిందీలో ప్రభాస్ నటించిన స్ట్రైట్ మూవీ ఇది. మొదటి రోజు ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ ఓపెనింగ్స్ మాత్రం చాలా బాగా వచ్చాయి.కానీ వీక్ డేస్ లో ఆశించిన స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేకపోయింది.రెండో వీకెండ్ కూడా సో సో గానే పెర్ఫార్మ్ చేసింది. ఒకసారి 11 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 35.91 cr
సీడెడ్ 9.66 cr
ఉత్తరాంధ్ర 10.20 cr
ఈస్ట్ 6.04 cr
వెస్ట్ 4.35 cr
గుంటూరు 6.55 cr
కృష్ణా 4.95 cr
నెల్లూరు 2.23 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 79.89 cr
హిందీ 69.02 cr
తమిళ్ 2.39 cr
కర్ణాటక 12.20 cr
కేరళ 0.86 cr
ఓవర్సీస్ 24.50 cr
వరల్డ్ వైడ్ (టోటల్ ) 188.86 cr

‘ఆదిపురుష్’ (Adipurush) చిత్రానికి రూ.228.9 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.230 కోట్ల షేర్ ను రాబట్టాలి. మొదటి రోజు ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. కానీ వీకెండ్ తర్వాత ఈ మూవీ పెర్ఫార్మన్స్ బాగా స్లో అయిపోయింది.

11 రోజులు పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.188.86 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.41.14 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఈ వారం నిఖిల్ స్పై రిలీజ్ అవుతుంది కాబట్టి.. ఇక బ్రేక్ ఈవెన్ కష్టమే అని చెప్పాలి.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus