Adipurush Collections: ‘ఆదిపురుష్’ .. మొదటి వారం ఎలా కలెక్ట్ చేసిందంటే..?

  • June 23, 2023 / 12:05 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆదిపురుష్’. కృతి సనన్ హీరోయిన్ గా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ మైథలాజికల్ మూవీని ‘టి సిరీస్ ఫిలిమ్స్’ ‘రిట్రోఫిల్స్ బ్యానర్ల పై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ కలిసి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్, వంటి వారు కూడా కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ జూన్ 16 న ఈ చిత్రం హిందీ, తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఏకకాలంలో విడుదలయ్యింది.

హిందీలో ప్రభాస్ నటించిన స్ట్రైట్ మూవీ ఇది. మొదటి రోజు ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ ఓపెనింగ్స్ మాత్రం చాలా బాగా వచ్చాయి.ఫస్ట్ వీకెండ్ ఈ మూవీ చాలా బాగా కలెక్ట్ చేసింది.కానీ సోమవారం నుండీ కలెక్షన్స్ తగ్గుతూ వస్తున్నాయి. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 34.27 cr
సీడెడ్ 9.03 cr
ఉత్తరాంధ్ర 9.62 cr
ఈస్ట్ 5.65 cr
వెస్ట్ 4.00 cr
గుంటూరు 6.37 cr
కృష్ణా 4.83 cr
నెల్లూరు 2.09 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 75.86 cr
హిందీ 64.58 cr
తమిళ్ 2.25 cr
కర్ణాటక 11.66 cr
కేరళ 0.80 cr
ఓవర్సీస్ 23.30 cr
వరల్డ్ వైడ్ (టోటల్ ) 178.45 cr

‘ఆదిపురుష్’ (Adipurush) చిత్రానికి రూ.228.9 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.230 కోట్ల షేర్ ను రాబట్టాలి. మొదటి రోజు ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. కానీ వీకెండ్ తర్వాత ఈ మూవీ పెర్ఫార్మన్స్ బాగా స్లో అయిపోయింది.

మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.178.45 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.51.55 కోట్ల షేర్ ను రాబట్టాలి. అది కూడా చిన్న టార్గెట్ అయితే కాదు. రెండో వీకెండ్ ను గట్టిగా క్యాష్ చేసుకుంటే తప్ప ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus