సోలో రిలీజ్ అవకాశాన్ని వేస్ట్ చేసుకోవడం లేదు కదా.. ‘ఆదిపురుష్’ టీం వింత చేష్టలు

ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మైథలాజికల్ డ్రామా ‘ఆదిపురుష్’. భారతీయుల ఇతిహాస గ్రంథం రామాయణం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. జూన్ 16న హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఏక కాలంలో విడుదల కాబోతోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తిరుపతిలో అభిమానుల సమక్షంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. అలాగే రిలీజ్ ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. అవి రెండు మంచి మార్కులు వేయించుకున్నాయి. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. దానికి యావరేజ్ రిపోర్ట్స్ వచ్చాయి.

ఇదిలా ఉండగా.. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయ్యాక.. చిత్ర బృందం ప్రమోషన్స్ విషయంలో ఇంకో అడుగు ముందుకు వేసింది అంటూ ఏమీ లేదు.ఓం రౌత్ హీరోయిన్ ను ముద్దుపెట్టుకుని ‘ఆదిపురుష్’ ని వార్తల్లో నిలిచేలా చేస్తే.. మరోపక్క సెలబ్రిటీలు 1000 టికెట్లు 10000 టికెట్లు కొనుక్కుని భక్తులకి ఇస్తున్నట్టు చెబుతున్నారు. వారు నిజంగానే టికెట్లు కొంటున్నారా లేదా చిత్ర బృందం అలా చెప్పి తప్పించుకుంటుందా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.

ఇదిలా ఉండగా.. చిత్ర బృందం మాత్రం ఒక్కటే ఆలోచనలో ఉందట. సినిమా రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ వచ్చాక.. సినిమాని గట్టిగా ప్రమోట్ చేయాలని డిసైడ్ అయ్యిందట. ‘రామాయణం’ కథతో రూపొందిన సినిమా కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ తప్పకుండా వస్తారు. సోలో రిలీజ్ కాబట్టి రిలీజ్ తర్వాత ప్రమోషన్ ఎక్కువ చేస్తే ఫలితం బాగుంటుంది అని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తుంది.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus