Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

Advertisement

ఒక సినిమాను రెండు ముక్కలు చేయడం.. పార్ట్‌ 1, పార్ట్‌ 2 అని పేరు పెట్టి ఆ సినిమాను రిలీజ్‌ చేయడం వెనుక రెండు కారణాలు ఉంటాయి. ఒకటి సినిమా కథ పెద్దగా ఉండటం.. ఒక పార్టులో చెప్పే అవకాశం లేకపోవడం ఒక కారణమైతే.. రెండోది ఆ సినిమా క్రియేట్‌ చేసే ఇంపాక్ట్‌, బజ్‌, వైబ్‌తో రెండు సినిమాల ద్వారా భారీ వసూళ్లు సంపాదించాలి అనే ఆలోచన. రెండో పాయింట్‌ బయటకు చెప్పరు అనుకోండి. తొలి పార్టు గురించే చూస్తే.. దాన్ని పర్‌ఫెక్ట్‌ ఆలోచించి, ప్లాన్‌ చేసి రిలీజ్‌ చేసిన సినిమా ‘ధురంధర్‌’.

Aditya Dhar

రణ్‌వీర్ సింగ్‌ హీరోగా ఆదిత్య ధర్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. తొలి భాగంగ గతేడాది డిసెంబరు 5న విడుదలై ప్రపంచవ్యాప్తంగా భారీ విజయం సాధించింది. ఇక రెండో పార్టు మార్చి 19న విడుదల చేశారు. అందులో ఏముంది వంద రోజుల గ్యాప్‌లో సినిమా రెండో పార్టు వచ్చేసింది కదా అంటారా. ఇక్కడే పాయింట్‌ ఉంది. రెండు ముక్కలు చేసిన సినిమాలు ఏవైనా ఇలా వంద రోజుల గ్యాప్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చాయా? ఇన్నేళ్ల సినిమా చరిత్రలో ఎవరూ ఇలా చేయలేకపోయారు అని చెప్పొచ్చు.

సినిమా కథ, కథనం అంతా ఓకే అనుకున్నాక.. ఒక భాగంలో సినిమా చెప్పడం కుదరదు అనుకొని రెండు పార్టులు చేసినట్లు ఇలా వంద రోజుల గ్యాప్‌లో రిలీజ్‌ చేయడం బట్టి అర్థమవుతోంది. అలాగే మన దర్శకులు రెండు పార్టులు అనే ఆప్షన్‌ని ఎలా వాడేస్తున్నారో అర్థమవుతుంది. తొలి భాగం విడుదలయ్యాక అందులో ఇబ్బందులు ఏమున్నాయి, ఇంకెంత డెవలప్‌ చేస్తే సినిమా బాగుంటుంది, ఇంకేం ఎలిమెంట్లు యాడ్‌ చేయాలి అనే లెక్కలు వేసి సినిమా కథ, కథనం, గమనం మార్చేస్తున్నారు దర్శకులు.

దీంతో సినిమా బడ్జెట్‌, సమయం అన్నీ పెరిగిపోయి రెండో పార్టు ఆలస్యమవుతూ వస్తోంది. ‘బాహుబలి’, ‘పుష్ప’, ‘కేజీయఫ్‌’ సినిమాలు ఇలా ఆలస్యమై, డెవలప్‌ చేసుకొని లేట్‌గా వచ్చినవే. ఇక ‘కల్కి 2’, ‘దేవర 2’, ‘సలార్‌ 2’ ఇలా ఆలస్యమైనవే. ఇప్పుడు ఆదిత్య ధర్‌ చూపించిన ‘రెండు ముక్కల’ సినిమా ఎలా ఉండాలో చెప్పారు. మరి మన దర్శకులు వింటారా?

చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

 

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus