టాలీవుడ్ జేమ్స్ బాండ్ అంటే ఇట్టే గుర్తుకొచ్చే పేరు అడివి శేష్(Adivi Sesh). తన సినిమాల కోసం అతను ఎంతగా హార్డ్ వర్క్ చేస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతను హీరోగా రూపొందిన ‘డెకాయిట్’ సినిమా ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది.
ఈ సినిమా షూటింగ్ అనుకున్నాడనికంటే ఆలస్యం అయ్యింది.అందుకు చాలా కారణాలు ఉన్నాయి. అయితే అడివి శేష్ షూటింగ్లో గాయ పడటం కూడా ఒక కారణం అని చెప్పాలి.
ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో అడివి శేష్ కాలికి బలమైన గాయం అయ్యిందట. వైద్యుల సూచన మేరకు ఆయన విశ్రాంతి తీసుకోవాల్సి రావడంతో, సినిమా షూటింగ్ 3 నెలలు ఆలస్యం అయ్యిందని తెలిపాడు.ఈ క్రమంలో బాడీ డబుల్ ని వాడుకునే వెసులుబాటు ఉంది కదా అని ప్రశ్నిస్తే.. ? అందుకు శేష్.. “హాలీవుడ్ సినిమాల్లో బాడీ డబుల్స్‌ని చాలా పర్ఫెక్ట్‌గా ఉపయోగిస్తారు. ఒక హీరో పైనుంచి దూకినప్పుడు కెమెరా యాంగిల్ కేవలం హెయిర్ స్టైల్‌ని మాత్రమే చూపిస్తుంది, దానివల్ల అది ఒరిజినల్ లాగే అనిపిస్తుంది.
కానీ తెలుగులో అలా ఉండదు. ముఖ్యంగా నా సినిమా విషయానికి వస్తే, ప్రేక్షకులకు నేను ఒరిజినల్ అనిపించాలి. నా కష్టం కనిపించాలి. డూప్‌ని వాడటం నాకు ఇష్టం లేదు. సీన్ పర్ఫెక్ట్‌గా రావాలంటే నేనే స్వయంగా చేయడం కరెక్ట్ అనేది నా అభిప్రాయం” అంటూ అడివి శేష్ చెప్పుకొచ్చాడు. శేష్ ఐడియాలజీకి అతని డెడికేషన్ కి మెచ్చుకోవాల్సిందే. అలాగే ‘డెకాయిట్’ కోసం ఫస్ట్ టైమ్ అతను డాన్స్ చేసి తన గ్రేస్ తో ఆకట్టుకున్నాడు.