అడివి శేష్(Adivi Sesh) సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ అనే ముద్ర ఉంది. లేట్ గా సినిమాలు చేస్తున్నా కన్సిస్టెంట్ గా హిట్లు కొడతాడు అనే నమ్మకం ఆడియన్స్ లో ఉంది.
ఇక నటుడు రాహుల్ రవీంద్రన్ కూడా దర్శకుడిగా మారి సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ‘చి ల సౌ’ ‘ది గర్ల్ ఫ్రెండ్’ వంటి హిట్లు ఇతని ఖాతాలో ఉన్నాయి.
మరోపక్క శేష్, రాహుల్ బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్ళ కాంబోలో సినిమా వస్తే బాగుణ్ణు అని కోరుకున్న సినీ ప్రియులు కూడా ఉన్నారు. వారి కోరిక త్వరలోనే తీరబోతుంది.అవును రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా ఓ సినిమా రూపొందనుంది. ఈ విషయాన్ని స్వయంగా రాహుల్, శేష్ ప్రకటించారు. ‘డెకాయిట్’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, అడివి శేష్ కాంబినేషన్లో ఒక ఇంటర్వ్యూ నిర్వహించారు.
ఇందులో భాగంగా.. ఓ ఎక్స్క్లూజివ్ ఇచ్చేద్దామా అంటూ రాహుల్.. శేష్ తో అనగా, పక్కనే ఉన్న వెన్నెల కిషోర్ ‘RR4′(రాహుల్ రవీంద్రన్ 4వ సినిమా అని అర్ధం) అంటూ పలకడం విశేషంగా చెప్పుకోవాలి. ఆ అనౌన్స్మెంట్ ‘నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ తో శేష్ సినిమా’ అంటూ హెడ్డింగ్లు పెడతారు అంటూ అడివి శేష్ చమత్కరించాడు. మొత్తానికి వీరిద్దరూ కలిసి వర్క్ చేస్తున్నట్టు ప్రకటించడం ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి కిక్ ఇచ్చే అంశం అనే చెప్పాలి.
Read Today's Latest
Movies Update. Get
Filmy News LIVE Updates on FilmyFocus