Deepika Padukone: ఇప్పుడు చెప్పండి ఎవరిని విమర్శించాలి.. దీపిక పడుకొణె రియాక్షన్‌ అదుర్స్‌

Advertisement

అంతా మేం చెప్పినట్లే జరగాలి.. లేదంటే ట్రోల్‌ చేస్తాం అంటూ ఓ బ్యాచ్‌ ఉంటుంది. వాళ్లే ట్రోలర్లు. మన టాలీవుడ్‌లోనే కాదు.. బాలీవుడ్‌లో కూడా ఇలాంటివాళ్లు ఉన్నారు. గత కొన్నేళ్లుగా పైరసీ కంటే బలంగా వ్యాపించేసిందీ ఈ జాడ్యం. వారంతా కలసి ఇప్పుడు పని గట్టుకుని చేస్తున్న పని ‘ధురంధర్‌’ సినిమాను తగ్గించేయడమే. ఆ సినిమాలు సాధించిన విజయాన్ని బాలీవుడ్‌ సెలబ్రేట్ చేసుకోవడం లేదు అంటూ గత కొన్ని నెలలుగా ఆడిపోసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆ సినిమా హీరో రణ్‌వీర్ సింగ్‌ భార్య దీపికా పడుకొణె పేరును కూడా లాగారు.

Deepika Padukone

భర్త సినిమా అంత భారీ విజయం అందుకున్నా.. ఇప్పటివరకు దీపిక ఈ సినిమా గురించి గొప్పగా మాట్లాడలేదు. ఒక హీరోయిన్‌ అయి ఉండి కూడా సినిమాను పొగడకపోతే ఎలా అంటూ మాటలకు పని చెప్పారు. తాజాగా వీటిపై దీపిక రియాక్ట్‌ అయింది. మీ అందరికంటే ముందే నేను ఆ సినిమాను చూశాను. ఈ విషయం మీకు తెలియదు. ఇప్పుడు చెప్పండి ఎవరు ఎవరిని విమర్శించాలి అని కౌంటర్‌ వేసింది. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టనంత మాత్రాన తన భర్తకు మద్దతు ఇవ్వడం లేదని అనుకోవడం సరికాదని కూడా కౌంటర్‌ ఇచ్చింది.

దీంతో ఇకనైనా ఈ వ్యవహారంలో ట్రోలింగ్‌ ఆగుతుందేమో చూడాలి. ఇక ఈ సినిమా విషయానికొస్తే ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన ‘ధురంధర్‌ 2: రివేంజ్‌’ సినిమా భారతీయ సినిమా చరిత్రలో రూ.1000 కోట్ల వసూళ్ల మార్క్‌ను దాటిన తొలి బాలీవుడ్ చిత్రంగా రికార్డులకెక్కింది. ఇప్పటివరకు ఈ సినిమాకు రూ.1600 కోట్లకుపైగా వసూళ్లు వచ్చాయి. ఈ సినిమాను కేవలం రూ.250 కోట్లతో రూపొందించిన విషయం తెలిసిందే.

ఇక తొలి భాగం ‘ధురంధర్‌’కి సుమారు రూ.1400 కోట్ల వసూళ్లు వచ్చాయి. అంటే రూ.250 కోట్లు ఖర్చు పెట్టి మొత్తంగా రూ.3000 కోట్లు వసూళ్లు చేశారు. ఇప్పటివరకు ఏ సినిమాకూ ఈ స్థాయి వసూళ్లు రాలేదు.

అస్సలు నా బుర్ర వాడిందే లేదు.. జాన్వీ కపూర్‌ కామెంట్స్‌ వైరల్‌

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus