ఇప్పుడు ఆ పాప ఎంత పెద్ద స్టార్ హీరోయిన్నో తెలిస్తే షాక్ అవుతారు..!

  • November 2, 2023 / 07:55 PM IST

టీవీలో సీరియల్స్ వచ్చాయంటే చాలు సీరియల్స్ మధ్యలో యాడ్స్ వస్తున్నాయా.. లేక యాడ్స్ మధ్యలో సీరియల్స్ వస్తున్నాయా అనేంత ఉన్నాయి. అలాంటి యాడ్స్ లో నటించి ఎంతో మంది ఫేమస్ అయ్యారు. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు చాలా మంది నటీనటులు యాడ్స్ లో నటించి ఫేమస్ అయ్యారు. ఒకప్పుడు ఓ సబ్బు యాడ్ వచ్చేది మీకు గుర్తుందా.. ఈ యాడ్ లో ఒక పాప.. ‘బంటి మీ సబ్బు స్లో నా ఏంటి’.. అంటూ చేతులు కడుక్కుంటున్న పిల్లాడిని చూసి అంటుంటుంది.

ఈ యాడ్ చాలా ఫేమస్ అయిపోయింది అందరిని అట్రాక్ట్ చేసింది. అయితే ఈ యాడ్ లో నటించిన ఆ పాప అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఆ చిన్న పాపే.. పెద్దగా అయిపోయింది. చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. బంటి నీ సబ్బు స్లో నా అంటూ లిక్విడ్ హ్యాండ్ వాష్ యాడ్‌లో ఓ యువతి కనిపించింది. ఆమె డైలాగ్ అప్పట్లో చాలా ఫేమస్ అయిపోయింది.

అయితే ఈ యాడ్‎లో నటించిన అమ్మాయి పేరు అవ్ నీత్ కౌర్. చిన్నప్పటి నుంచి తాను ఎన్నో డ్యాన్స్, రియాల్టీ షోలు, యాడ్స్ లో నటించి పాపులారిటీ సంపాదించుకుంది.ఆ తర్వాత పలు సీరియల్స్ లో కూడా నటించింది. పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఈ బ్యూటీ ప్రస్తుతం హిందీ సినిమాల్లోనూ హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో టింకూ వెడ్స్ షేర్ సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఇప్పుడు ఆమె ఫోటోలు చూసిన నెటిజన్లు.. ఆ యాడ్ లో నటించిన (Avneet Kaur) అమ్మాయి ఇలా మారిపోయిందా అని కళ్లు ఆర్పకుండా చూస్తున్నారు.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus