అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప’ సినిమాలో నటిస్తున్నాడు. రెండు పార్ట్ లుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి పార్ట్ ‘పుష్ప : ది రైజ్’ పేరుతో రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రం విడుదల పై నిర్మాతలు చెప్పిన డేట్ గ్యారెంటీ అని చెప్పలేము కానీ.. రెండో పార్ట్ షూటింగ్ మొదలయ్యే లోపు బన్నీ ఓ సినిమా చేస్తాడనేది ఎప్పటి నుండో నడుస్తున్న చర్చ. దీని పై తాజాగా ప్రముఖ నిర్మాత అలాగే అల్లు అర్జున్ కు అత్యంత సన్నిహితుడు అయిన బన్నీవాస్ క్లారిటీ ఇచ్చాడు.
ఆయన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా ప్రమోషన్లలో భాగంగా మాట్లాడుతూ ఈ విషయం పై స్పందించాడు. బన్నీ వాస్ మాట్లాడుతూ… “అల్లు అర్జున్‌గారితో బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా ప్లానింగ్‌లో ఉంది. ‘పుష్ప’ రిలీజ్ తర్వాత ఆ సినిమా పై క్లారిటీ వస్తుంది. ఆయన సినిమాల లైనప్ విషయంలో ఇప్పుడేం ఏదీ కన్ఫర్మ్ అని చెప్పలేం” అంటూ చెప్పుకొచ్చాడు. అల్లు అర్జున్- బోయపాటి శ్రీను కాంబినేషన్లో గతంలో ‘సరైనోడు’ అనే చిత్రం వచ్చింది.
ఈ చిత్రం మాస్ ఆడియెన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. అల్లు అర్జున్ కు మాస్ ఫాలోయింగ్ ను ఈ చిత్రం మరింత పెంచిందనే చెప్పాలి. మరి ఈ కాంబో అంటే సహజంగానే అంచనాలు ఏర్పడతాయి కదా..! ఈ కాంబోలో మూవీ రావడానికి ఎక్కువ టైం అయితే పట్టదు అని బన్నీవాస్ చెప్పకనే చెప్పినట్టు అయ్యింది.
Most Recommended Video
సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు