Ajith and Siva: ఐదోసారి కలసి పని చేయబోతున్న హీరో – డైరక్టర్‌.. మరో V టైటిల్‌ రెడీ

Advertisement

అజిత్‌ – శివ.. కోలీవుడ్‌లో ది బెస్ట్‌ కాంబినేషన్‌ అంటూ ఓ లిస్ట్‌ రాస్తే అందులో తొలుతగా వచ్చే పేరు ఇదే. ఎందుకంటే ఈ కాంబినేషన్‌లో ఇప్పటివరకు నాలుగు సినిమాలు వచ్చాయి. దేనికదే భారీ విజయం అందుకుని ఒకదానికి మించి మరొకటి అనిపించాయి. అయితే ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా వచ్చి ఏడేళ్లు అవుతోంది. దీంతో మళ్లీ ఎప్పుడు కలసి సినిమా చేస్తారు అనే చర్చ గత కొన్ని రోజులుగా జరుగుతోంది. ఈ ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్‌ పడబోతోంది. ఇద్దరూ కలసి ఓ సినిమా చేయబోతున్నట్లు కోడంబాక్కం వర్గాల టాక్‌.

Ajith and Siva

‘వీరమ్‌’, ‘వేదాళం’, ‘వివేగమ్‌’, ‘విశ్వాసం’ అంటూ నాలుగు సినిమాలు చేసిన అజిత్‌ – శివ ఐదో సినిమాకు సర్వం సిద్ధం చేసుకున్నారట. త్వరలో సినిమా ప్రకటన ఉంటుంది అని శివనే చెప్పారు. ప్రస్తుతం అజిత్‌ అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్‌ పనులు పూర్తయ్యాక శివ సినిమా మొదలవుతుంది అని చెబుతున్నారు. ఈ సినిమాకు కూడా V అక్షరంలోనే టైటిల్‌ ఉండేలా చూసుకుంటున్నారట. ఎందుకంటే వీరికి V హిట్‌ టైటిల్‌ కాబట్టి. పైన నాలుగు సినిమాల పేర్లు చూశారుగా.

దర్శకుడు శివ సినిమాల సంగతి చూస్తే.. అజిత్‌తో చేసిన ‘విశ్వాసం’ తర్వాత ఇప్పటివరకు విజయం అందుకోలేకపోయారు. రజనీకాంత్ ‘అన్నాత్తె’, సూర్య ‘కంగువ’ ఇబ్బందికర ఫలితాలను ఇచ్చాయి. ‘కంగువ’ ఫలితం అయితే ఇమేజ్‌కి బాగా డ్యామేజీ చేసింది. అగ్ర హీరోతో ఇలాంటి సినిమానా అనే విమర్శకులు ఎదుర్కొన్నారు. ఇక అజిత్‌ సినిమా విషయానికొస్తే.. 2024లో ఒక్క సినిమా కూడా చేయని.. గతేడాది రెండు సినిమాలతో వచ్చాడు.

‘విదామయూర్చి’, ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ సినిమాలు ఆయన నుండి వచ్చాయి. ఆ తర్వాత ఆయన కార్‌ రేసింగ్‌లో బిజీ అయిపోయారు. ఇప్పుడు వాటికి కాస్త గ్యాప్‌ ఇచ్చి సినిమాలవైపునకు వస్తున్నారు. ఇక వరుస సినిమాలు చేస్తారని సమాచారం.

సీక్వెల్‌/ రీమేక్‌ అంటే నాకు చావుతో సమానం.. విజయ్‌ సేతుపతి కామెంట్స్‌ వైరల్‌

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus