Ajith, Sreeleela: అజిత్ శ్రీలీల కాంబినేషన్ లో సినిమా.. ఆ కామెంట్లు వినిపిస్తాయా?

  • April 24, 2024 / 10:41 AM IST

కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో అజిత్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అజిత్ (Ajith) కొత్త సినిమాలో అజిత్ కు జోడీగా శ్రీలీల (Sreeleela) కనిపించనున్నారని తెలుస్తోంది. అజిత్ వయస్సు 52 సంవత్సరాలు కాగా శ్రీలీల వయస్సు 22 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య దాదాపుగా 30 సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉంది. అజిత్ సైతం తన పక్కన మరీ యంగ్ హీరోయిన్లను తీసుకోవాలని భావించరు. ఈ కాంబినేషన్ లో సినిమాకు సంబంధించి అధికారికంగా క్లారిటీ వస్తే మాత్రమే వైరల్ అవుతున్న వార్తల్లో నిజానిజాలు తెలిసే అవకాశాలు అయితే ఉంటాయి.

అజిత్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు యంగ్ జనరేషన్ హీరోలకు జోడీగా నటించిన శ్రీలీల సీనియర్ హీరోలకు ఓకే చెప్పడం వెనుక కారణాలేంటి? అనే ప్రశ్నలు సైతం వ్యక్తమవుతూ ఉన్నాయి. అజిత్ పారితోషికం ప్రస్తుతం 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంగా ఉండగా శ్రీలీల మాత్రం పరిమితంగా పారితోషికం తీసుకుంటున్నారు.

గుంటూరు కారం (Guntur Kaaram) సినిమా వరకు వరుసగా సినిమా ఆఫర్లను అందుకున్న శ్రీలీలకు ఆ తర్వాత మాత్రం ఆఫర్లు తగ్గాయి. గతేడాది శ్రీలీల నటించిన సినిమాలలో భగవంత్ కేసరి (Bhagavath Kesari) మినహా మిగతా సినిమాలు ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరిచాయి. శ్రీలీల కథల ఎంపికలో చేసిన పొరపాట్లే ఆమెకు మైనస్ అవుతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అజిత్ సినిమాలు తెలుగులో కూడా పరవాలేదనే స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుండటం గమనార్హం. అజిత్, శ్రీలీలలకు సోషల్ మీడియాలో ఊహించని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అజిత్ మాస్ ప్రేక్షకులను మెప్పించే సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus