Akhanda Movie: బాలకృష్ణ సినిమా రిలీజ్‌ డేట్‌ ఇదేనా!

Advertisement

కరోనా ఫస్ట్‌ వేవ్‌ తర్వాత సినిమా విడుదల తేదీ విషయంలో ఆలస్యంగా స్పందించిన అగ్ర హీరోల్లో నందమూరి బాలకృష్ణ మెయిన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు కరోనా సెకండ్‌ వేవ్‌ తర్వాత ఆయనే ముందుగా రిలీజ్‌ డేట్‌ చెప్పనున్నారనేది టాక్‌. అవును ‘అఖండ’ రిలీజ్‌ డేట్‌ ప్రకటించడానికి చిత్రబృందం సిద్ధమవుతోందట. అన్నీ అనుకున్నట్లు జరిగితే కరోనా సెకండ్‌ వేవ్‌ తర్వాత వచ్చే అగ్రహీరో సినిమా బాలయ్యదే అంటున్నారు.

‘బాలయ్య – బోయపాటి’ హ్యాట్రిక్‌ అంటూ సినిమా మీద తొలి రోజుల్లోనే చాలా హైప్‌ క్రియేట్‌ అయ్యింది. అయితే ఏమైందో కానీ… సినిమా పనులు ఆలస్యంగా సాగాయి. మధ్యలో కొన్ని రోజుల ఆగాయి. ఇక వేగం పుంజుకుంటుంది అనుకునేలోపు కరోనా వచ్చి స్లో చేసేసింది. దీంతో సినిమా ఆగుతూ, ఆగుతూ ఇప్పుడు పూర్తవుతోంది. త్వరలో పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేసేలా ప్రయత్నాలు చేస్తున్నారు.

సినిమా అంతా సిద్ధమవ్వడంతో రిలీజ్‌ డేట్‌ చెప్పి… ప్రమోషన్‌ స్టార్ట్‌ చేసే పనిలో ఉన్నారట బాలయ్య – బోయపాటి. వచ్చే వినాయకచవితి కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారని అంటున్నారు. అంటే సెప్టెంబరు 10న సినిమా విడుదల ఉండొచ్చని సమాచారం. ఇప్పటికే వచ్చిన ప్రచార చిత్రాలు సినిమా బాగా క్రేజ్‌ తీసుకొచ్చాయి. వాటిని డబుల్‌ చేయడంలో ఇప్పుడు బోయపాటి టీమ్‌చేతిలో ఉంది.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus