Laxmii: రికార్డులు సృష్టిస్తోన్న ‘లక్ష్మి’ సినిమా!

  • April 3, 2021 / 06:38 PM IST

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ‘లక్ష్మి’ సినిమాకి నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో థియేటర్లో సినిమాను విడుదల చేసే ఛాన్స్ లేక.. ఈ సినిమాను హాట్ స్టార్ ద్వారా నేరుగా ఆన్లైన్ లో విడుదల చేశారు. అలా విడుదలైన ఈ సినిమాకి దారుణమైన రివ్యూలు వచ్చాయి. అక్షయ్ కుమార్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇదేనంటూ తేల్చేశారు. సోషల్ మీడియాలో కూడా ఈ సినిమాకి పూర్తిగా నెగెటివ్ టాక్ వచ్చింది.

కానీ ఈ టాక్ సినిమాకి వ్యూస్ ను తగ్గించలేకపోయింది. హాట్ స్టార్ లో ఈ సినిమాను ఎగబడి చూశారు ప్రేక్షకుల. హాట్ స్టార్ హిస్టరీలోనే కాదు.. మొత్తం ఇండియన్ ఓటీటీ సినిమాల్లోనే అత్యధిక వ్యూస్ తెచ్చుకున్న సినిమాగా ‘లక్ష్మి’ రికార్డు నెలకొల్పడం విశేషం. తాజాగా ఈ సినిమాను టీవీల్లో ప్రీమియర్ వేయగా.. ఏకంగా 2.5 కోట్ల ఇంప్రెషన్స్ వచ్చాయి. దీంతో ఇండియన్ శాటిలైట్ చరిత్రలో అత్యధిక వ్యూస్ తెచ్చుకున్న సినిమాగా ‘లక్ష్మి’ రికార్డు నెలకొల్పింది.

నిజానికి లాక్ డౌన్ సమయంలో హాట్ స్టార్ యాప్ లో సబ్‌స్క్రిప్షన్లు భారీగా పెరిగాయి. దీంతో మెజారిటీ ప్రేక్షకులు ఈ సినిమాను చూశారు. అయినప్పటికీ ఇప్పుడు టీవీలో ప్రీమియర్ వేస్తే ఈ స్థాయిలో వ్యూస్ రావడం విశేషమనే చెప్పాలి. సౌత్ ఇండస్ట్రీలో భారీ విజయాన్ని అందుకున్న ‘కాంచన’ సినిమాకి రీమేక్ గా ‘లక్ష్మి’ సినిమాను తెరకెక్కించారు. ఒరిజినల్ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన రాఘవ లారెన్స్ ఈ సినిమాను కూడా డైరెక్ట్ చేశాడు.

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus