అతి త్వరలో కాజల్‌ అగర్వాల్‌ పెళ్ళి!

టాలీవుడ్‌ మోస్ట్‌ బ్యూటిఫుల్‌ హీరోయిన్లలో ఒకరైన కాజల్‌ అగర్వాల్‌ అతి త్వరలో పెళ్ళి చేసుకోబోతుంది. ముంబయ్‌కి చెందిన వ్యాపారవేత్త గౌతమ్‌ కిట్‌చ్లుతో చందమామ ఏడడుగులు వేయబోతోంది. వీళ్ళిద్దరిదీ అరెంజ్డ్‌ కమ్‌ లవ్‌ మ్యారేజ్‌ అని టాక్‌. కొన్నాళ్ళుగా కాజల్‌ పెళ్ళి కబురు వినబడుతూ వుంది. కాని అగర్వాల్‌ ఫ్యామిలీ కన్‌ఫర్మ్‌ చెయ్యడం లేదు. లేటెస్ట్‌ ఇన్ఫర్మేషన్‌ ఏంటంటే… ఆల్రెడీ పెళ్ళి ఎలా చెయ్యాలి? ఎక్కడ చెయ్యాలి? వంటి విషయాలు మాట్లాడుకున్నార్ట.

కాజల్‌ అగర్వాల్‌కి కాబోయే భర్తకి ఇంటీరియర్‌ డిజైనింగ్‌ కంపెనీ వుంది. ఇంటిని అందంగా డెకరేట్‌ చెయ్యడం అతడికి ఇష్టం. ‘డిసెర్న్‌ లివింగ్‌’ కంపెనీ పెట్టిన అతడి గురించి కొన్ని మ్యాగజైన్లు ఆర్టికల్స్‌ రాశాయి. కామన్‌ ఫ్రెండ్స్‌ ద్వారా కలిసిన గౌతమ్‌, కాజల్‌ లవ్‌లో పడిన విషయం పెద్దలకు తెలుసట. ఇద్దరి ఫ్యామిలీలు మాట్లాడుకుని పెళ్ళి చేస్తున్నాయి. లాక్‌డౌన్‌లో టాలీవుడ్‌లో కొందరు హీరోలు పెళ్ళి పీటలు ఎక్కారు. రానా, నితిన్‌, నిఖిల్‌ లైఫ్‌లో సెటిల్‌ అయ్యారు.

లాక్‌డౌన్‌ తరువాత పెళ్ళిల్లు జరగలేదు. ముంబయ్‌లోనూ లాక్‌డౌన్‌ తరువాత జరగబోయే మొదటి సెలబ్రిటీ మ్యారేజ్‌ కాజల్‌దే అని టాక్‌. ఆల్రెడీ కాజల్‌ పేరెంట్స్‌ వినయ్‌ అగర్వాల్‌, సుమన్‌ అగర్వాల్‌ పెళ్ళి ఏర్పాట్లు చెయ్యడం స్టార్ట్‌ చేశారట. ముంబయ్‌లోని కాజల్‌ ఇంటికి దగ్గరలోని ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో పెళ్ళి జరుగుతుందని టాక్‌.

https://instagram.com/kitchlug?igshid=1rpw7u7mqo513

Most Recommended Video

‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
‘బిగ్‌బాస్‌’ స్వాతి దీక్షిత్ గురించి మనకు తెలియని నిజాలు..!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus