భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!

టాలీవుడ్లో ఓ సెంటిమెంట్ ఉంది… ‘దర్శకధీరుడు రాజమౌళితో సినిమా చేసిన ఏ హీరోకి అయినా.. తరువాత సినిమా డిజాస్టర్ ఫలితం ఇస్తుంది అని’..! ఇది చాలా వరకూ ప్రూవ్ అవుతూ వచ్చింది. ఆఖరికి నాని, సునీల్ వంటి హీరోలు కూడా ఆ సెంటిమెంట్ నుండీ తప్పించుకోలేకపోయారు. ఒక్క రాజమౌళితో అనే కాదు.. ఓ పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరో చేసే తరువాతి సినిమా పై భారీ అంచనాలు నెలకొంటాయి. ఆ అంచనాలను అందుకోలేక.. వారి తరువాతి సినిమాలు ప్లాప్ అవుతూ ఉంటాయి. ఈ సెంటిమెంట్ అయితే ఎప్పటి నుండో ఉంది. అయితే ఇప్పటి జనరేషన్ స్టార్ హీరోలు బ్లాక్ బస్టర్ ఇచ్చిన తరువాత.. డిజాస్టర్ సినిమాలతో అభిమానులను నిరాశపరిచిన సందర్భాలను ఓ లుక్కేద్దాం రండి :

1) పవన్ కళ్యాణ్:

‘ఖుషి’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ తరువాత ‘జానీ’ వంటి డిజాస్టర్ సినిమా ఇచ్చాడు.

2) ప్రభాస్:

రాజమౌళి డైరెక్షన్లో ప్రభాస్ చేసిన ‘ఛత్రపతి’ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో..ఆ తరువాత ప్రభుదేవా డైరెక్షన్లో వచ్చిన ‘పౌర్ణమి’ చిత్రం అంత పెద్ద డిజాస్టర్ అయ్యింది.

3) మహేష్ బాబు:

‘శ్రీమంతుడు’ వంటి నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన మహేష్ బాబు.. ఆ తరువాత ‘బ్రహ్మోత్సవం’ అనే ఎపిక్ డిజాస్టర్ ను కూడా ఇచ్చాడు.

4) మహేష్ బాబు:

‘పోకిరి’ వంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన మహేష్.. ఆ తరువాత ‘సైనికుడు’ వంటి డిజాస్టర్ ను ఇచ్చాడు.

5) ఎన్టీఆర్:

రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్ చేసిన ‘సింహాద్రి’ చిత్రం ఆల్ టైం బ్లాక్ బస్టర్ గా నిలిస్తే.. అటు తరువాత పూరి జగన్నాథ్ డైరెక్షన్లో చేసిన ‘ఆంధ్రావాలా’ చిత్రం పెద్ద డిజాస్టర్ గా మిగిలింది.

6) రాంచరణ్:

రాజమౌళి డైరెక్షన్లో రాంచరణ్ చేసిన ‘మగథీర’ చిత్రం ఇండస్ట్రీ హిట్ అయితే.. అటు తరువాత ‘బొమ్మరిల్లు’ భాస్కర్ డైరెక్షన్లో చేసిన హానెస్ట్ లవ్ స్టోరీ చిత్రం ‘ఆరెంజ్’ మాత్రం డిజాస్టర్ గా మిగిలింది.

7) అల్లు అర్జున్:

త్రివిక్రమ్ డైరెక్షన్లో చేసిన ‘జులాయి’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందించిన అల్లు అర్జున్.. అటు తరువాత పూరి జగన్నాథ్ డైరెక్షన్లో చేసిన ‘ఇద్దరమ్మాయిలతో’ చిత్రంతో డిజాస్టర్ ఇచ్చాడు.

8) రాంచరణ్:

‘రంగస్థలం’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన రాంచరణ్… అటు తరువాత ‘వినయ విధేయ రామ’ వంటి డిజాస్టర్ కూడా ఇచ్చాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus