Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

ఎప్పుడు అనే మాట చెప్పడం లేదు.. అలా అని ఇప్పుడు కాదు అనే మాట కూడా చెప్పడం లేదు.. ఇదిగో, అదిగో అని మాత్రం చెబుతున్నారు. గత కొన్ని నెలలుగా ఆ స్టార్‌ హీరో సినిమా సీక్వెల్‌ గురించి ఇదే చర్చ జరుగుతోంది. దీంతో ఏ మాట నమ్మాలో, ఏ మాట నమ్మకూడదో అర్థం కాక.. మొదలైనప్పుడు చూద్దాంలే అని ఆ హీరో ఫ్యాన్స్‌ కామ్‌ అయిపోయారు. ఇలాంటి సమయంలో తాజాగా మరోసారి ఇదిగో, అదిగో అంటూ సినిమా షూటింగ్ ప్రారంభించే డేట్‌ గురించి రూమర్లు వచ్చాయి. ఆ సినిమానే ‘కల్కి 2’.

Kalki 2

‘కల్కి 2898 ఏడీ’ సినిమా వచ్చి 20 నెలలు అయిపోతోంది. ఆ సినిమా ఎండ్‌ కార్డ్స్‌లో ‘కల్కి 2’ అని వేసి సినిమా సీక్వెల్‌ గురించి క్లారిటీ ఇచ్చిన దర్శకుడు నాగీ అలియాస్‌ నాగ్‌ అశ్విన్‌ ఆ తర్వాత ఎక్కడా ఆ సినిమా గురించి మాట్లాడలేదు. నిర్మాతలు ప్రియాంక దత్‌, స్వప్నా దత్‌ మాత్రం సినిమా గురించి మాట్లాడుతూ వస్తున్నాయి. తాజాగా ఈ సినిమా గురించి ఓ పెద్ద సెట్‌ వేశారు అనే టాక్‌ని బయటకు పంపించారు. నగర శివారులో ఆ సెట్‌ ఏర్పాట్లు పూర్తయ్యాయని సమాచారం.

ఇక్కడో మేటర్‌ ఏంటంటే.. ఆ సెట్‌లో ఈ రోజు నుండి సినిమా షూటింగ్‌ మొదలైంది అని చెబుతున్నారు . నాగ్ అశ్విన్ స్క్రిప్ట్‌ను పక్కాగా సిద్ధం చేయడం, శంకర్ పల్లిలోని ఓ స్టూడియోలో గత కొన్ని నెలలుగా వేస్తున్న దేశంలోనే అతిపెద్ద సెట్స్‌లో ఒకటి పూర్తవ్వడంతో షూటింగ్‌ ప్రారంభించేస్తున్నారు అని టాక్‌. దీని కోసం అమితాబ్ బచ్చన్ హైదరాబాద్ వచ్చారట. ఈ షెడ్యూల్‌లో ప్రభాస్, అమితాబ్ మధ్య వచ్చే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారట. ఈ షెడ్యూల్ కోసం ప్రభాస్ 10 రోజుల డేట్స్‌ ఇచ్చాడని అంటున్నారు. చూద్దాం రెగ్యులర్‌ ప్రభాస్‌ సినిమాల సెట్స్‌ నుండి లీకులు ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడేమైనా వస్తాయేమో.

విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus