Premalu 2, Marco 2: మలయాళ క్రేజీ సీక్వెల్స్.. ఊహించని షాక్..!

Advertisement

2024 మలయాళ సినీ పరిశ్రమకి చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే గతేడాది మలయాళంలో చాలా బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ పడ్డాయి. అందులో 2, 3 ఇండస్ట్రీ హిట్స్ కూడా ఉండటం విశేషంగా చెప్పుకోవాలి. ‘ప్రేమలు’ (Premalu) అనే చిన్న సినిమా మలయాళంలో అప్పటివరకు ఉన్న రికార్డులన్నింటినీ బ్రేక్ చేసింది.

Premalu 2, Marco 2

ఆ తర్వాత వచ్చిన ‘మంజుమ్మల్ బాయ్స్’ (Manjummel Boys) కూడా అంతే..! ఇక అటు తర్వాత ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) హీరోగా వచ్చిన ‘ఆవేశం’ (Aavesham) కూడా భారీ వసూళ్లు సాధించి ఇండస్ట్రీ రికార్డులు సృష్టించింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా హిట్లు ఉన్నాయి. సౌత్ లో 2024 కి గాను ఎక్కువ హిట్లు అందుకున్న ఇండస్ట్రీగా మలయాళ సినీ పరిశ్రమ నిలిచింది. ఇక 2024 లోని మలయాళ హిట్ సినిమాల్లో ‘మార్కో’ (Marco) కూడా ఉంది.

ఇదిలా ఉండగా.. ‘ప్రేమలు’ (Premalu) ‘మార్కో’ (Marco) సినిమాలకి సీక్వెల్స్ కూడా ఉంటాయని అంతా అనుకున్నారు. ‘ప్రేమలు 2’ (Premalu 2) ఉంటుందని మేకర్స్ కూడా పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. కానీ ఊహించని విధంగా ఈ సినిమా హోల్డ్ లో పడింది. హీరో నెస్లెన్ కి ‘ప్రేమలు 2’ స్క్రిప్ట్ నచ్చలేదట. దీంతో స్క్రిప్ట్ పక్కాగా వచ్చిన తర్వాతే చేద్దామని దర్శకుడు గిరీష్ (Gireesh) కి చెప్పినట్టు వినికిడి. మరోపక్క ‘మార్కో 2’ (Marco 2) కూడా ఉండదని చెప్పి హీరో ఉన్ని ముకుందన్ (Unni Mukundan) షాకిచ్చాడు.

‘ఆ సినిమాపై భయంకరమైన నెగిటివిటీ వచ్చిందని.. అయినప్పటికీ కొంతమంది సమీక్షకులు, ప్రేక్షకులు, నెటిజెన్లు మేకింగ్ విషయంలో అభినందించినందుకు సంతోషంగా ఉందని., కచ్చితంగా ఆ సినిమాని మరిపించే సినిమా ఇంకోటి అందిస్తానని ఉన్ని ముకుందన్’ (Unni Mukundan) ట్వీట్ వేశాడు. సో ‘మార్కో 2’ కూడా లేనట్టే..!

 శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read