Salaar: ‘సలార్’ నుండి సెకండ్ టీజర్.. నిజమెంత?

  • October 31, 2023 / 05:57 PM IST

ప్రభాస్ నుండి ఓ మాస్ మూవీ వస్తుంది అంటే.. దాని అంచనాలు వేరే స్థాయిలో ఉంటాయి. 2013లో వచ్చిన ‘మిర్చి’ తర్వాత అంటే 10 ఏళ్లుగా ప్రభాస్ నుండీ మరో మాస్ మూవీ రాలేదు. ‘బాహుబలి’ కంప్లీట్ గా పీరియాడికల్ డ్రామా, ‘సాహో’ కంప్లీట్ యాక్షన్ మూవీ, రాధే శ్యామ్ పీరియాడిక్ లవ్ స్టోరీ, ఇక ‘ఆదిపురుష్’ అయితే మైథలాజికల్ డ్రామా.. ! అయితే ప్రభాస్ నుండి రాబోతున్న ‘సలార్’ మాత్రం పక్కా మాస్ మూవీ.

‘కే.జి.ఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా.. మొదటి పార్ట్ ‘సలార్ : సీజ్ ఫైర్’ పేరుతో రిలీజ్ కాబోతుంది. వాస్తవానికి సెప్టెంబర్ 28 నే ఈ సినిమా రిలీజ్ కావాలి. కానీ కొన్ని కారణాల వల్ల లేట్ అయ్యింది. ఫైనల్ గా డిసెంబర్ 22 న ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్లు టీం ప్రకటించింది. ఇదిలా ఉండగా.. ఆల్రెడీ ‘సలార్’ నుండి ఒక టీజర్ వచ్చింది. దానికి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా.. యూట్యూబ్లో అయితే రికార్డులు సృష్టించింది.

ప్రభాస్ ను ఎక్కువగా చూపించలేదు అనే కంప్లైంట్ తప్ప.. ఆ టీజర్ అయితే బాగానే ఉంది. ఇదిలా ఉండగా.. నవంబర్ నుండి ‘సలార్’ ప్రమోషన్స్ మొదలుకానున్నాయి అని ఇన్సైడ్ టాక్. ఇందులో భాగంగా దీపావళికి (Salaar) ‘సలార్’ నుండి మరో టీజర్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయట. దీనిపై చిత్ర బృందం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus