మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ అలా ఉంటుందా?

  • January 3, 2023 / 06:04 PM IST

మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ ఎన్నో ఆవాంతరాలను దాటుకుని ఈ నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న సంగతి తెలిసిందే. మే నెలాఖరు నాటికి ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి ఈ ఏడాది సెకండాఫ్ లో ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. అయితే ఈ సినిమాలో అల్లు అర్హ కీలక పాత్రలో కనిపిస్తారంటూ సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం. గుణశేఖర్ డైరెక్షన్ లో తెరకెక్కిన శాకుంతలం సినిమాతో అల్లు అర్హ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు.

ఈ సినిమాలో భరతుని పాత్రలో అల్లు అర్హ కనిపించనున్నారు. మహేష్ త్రివిక్రమ్ కాంబోలో ఒక పాత్ర కోసం మేకర్స్ అర్హ పేరును పరిశీలిస్తున్నారని బోగట్టా. బన్నీ త్రివిక్రమ్ సన్నిహితులు కావడంతో త్రివిక్రమ్ అడిగితే మహేష్ సినిమాలో అర్హ నటించడానికి బన్నీ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మరోవైపు మహేష్ రాజమౌళి కాంబో మూవీ స్క్రిప్ట్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయని సమాచారం.

ఈ ఏడాది సెకండాఫ్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మహేష్ రాజమౌళి కాంబో మూవీ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుండగా ఇతర దేశాల ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ మూవీకి ఇతర దేశాల ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన వచ్చిందనే సంగతి తెలిసిందే. అల్లు అర్హ మహేష్ త్రివిక్రమ్ కాంబో సినిమాలో నటిస్తుందో లేదో మేకర్స్ నుంచి అతి త్వరలో క్లారిటీ వస్తుందని చెప్పవచ్చు.

వరుస ఫ్లాపులతో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న పూజా హెగ్డే కెరీర్ కూడా ఒక విధంగా మహేష్ బాబు సినిమాపైనే ఆధారపడి ఉందని చెప్పవచ్చు. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే మాత్రమే పూజా హెగ్డే తెలుగులో స్టార్ హీరోయిన్ గా విజయవంతంగా కెరీర్ ను కొనసాగించే ఛాన్స్ అయితే ఉంది.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus