ఈ సోషల్ మీడియా డిజిటల్ యుగంలో సినిమా కంటెంట్‌ను కాపాడుకోవడం మేకర్స్‌కు పెద్ద టాస్క్‌గా మారిపోయింది. కనీసం ప్రాజెక్ట్ అనౌన్స్ చేయకముందే.. స్టోరీ, టైటిల్, హీరోల లుక్స్ బయటకు లీక్ అయిపోతున్నాయి.
సెట్స్‌లో సెక్యూరిటీ ఎంత టైట్‌గా పెట్టినా మేకింగ్ వీడియోలు నెట్టింట దర్శనమిస్తున్నాయి. కానీ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అట్లీ కాంబోలో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘AA22’ విషయంలో మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నమైన పరిస్థితి నెలకొన్నది.
ఈ భారీ సినిమా షూటింగ్ ఇప్పటికే దాదాపు 50 శాతం కంప్లీట్ అయింది. కానీ, ఇప్పటివరకు ఈ మూవీ జానర్ ఏంటి? స్టోరీ ఏంటి? బన్నీ లుక్ ఎలా ఉండబోతోంది? అనే విషయాలపై బయట చిన్న హింట్ కూడా లేదు. కనీసం వర్కింగ్ టైటిల్‌పై కూడా ఎలాంటి రూమర్స్, స్పెక్యులేషన్స్ లేకపోవడం నిజంగా ఆశ్చర్యమే. లీక్స్ రాయుళ్లకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా కంటెంట్‌ను ఇంత పకడ్బందీగా కాపాడుకోవడం ‘AA22’ టీమ్ సాధించిన ఓ పెద్ద అచీవ్‌మెంట్.
ఈ ‘జీరో లీకేజ్’ వెనుక అట్లీ అండ్ టీమ్ భారీ స్కెచ్చే వేసింది. సెట్స్‌పై సెక్యూరిటీ కోసం ప్రొడక్షన్ టీమ్ ఏకంగా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. అంతేకాదు.. సినిమాకు సంబంధించిన ఎలాంటి డీటెయిల్స్ బయట లీక్ చేయకూడదని, యూనిట్ సభ్యులందరితో స్ట్రిక్ట్‌గా అగ్రిమెంట్లు (NDAs) కూడా రాయించుకున్నారట. అందుకే అక్కడి నుంచి ఓ చిన్న ఫోటో కూడా బయటకు రావడం లేదు.
ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీని అమాంతం పెంచేసిన ఈ మూవీ టీమ్.. ఏప్రిల్ 8న బన్నీ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌తో పాటు టైటిల్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేయబోతోంది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసి.. 2027 సమ్మర్‌లో థియేటర్లలో భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.