Allu Arjun: బేబీ ప్రొడ్యూసర్ ఇంటికి ఐకాన్ స్టార్!

బేబీ సినిమా ద్వారా నిర్మాతగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో ఎస్కేఎన్ ఒకరు. బేబీ సినిమా ద్వారా నిర్మాతగా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి ఈయన సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు. ఈ క్రమంలోనే కెరియర్ పరంగా ఇండస్ట్రీలో కూడా బిజీ అయ్యారు ఇకపోతే ఇటీవల ఎస్ కే ఎన్ ఇంట్లో విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. నిర్మాత ఎస్కేఎన్ తండ్రిగారు ఇటీవల మరణించిన విషయం తెలిసిందే.

అయితే ఈయన తండ్రి మరణించి దాదాపు పది రోజులు అవుతున్నప్పటికీ ఆ బాధ నుంచి ఎస్ కే ఎన్ కుటుంబ సభ్యులు బయటపడలేదు. ఈ క్రమంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎస్కేయన్ ఇంటికి వెళ్లి తన తండ్రి చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం ఆయనతో మాట్లాడి తనకు ఓదార్పును కలిగించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ప్రొడ్యూసర్ ఎస్ కే ఎన్ ఎప్పటినుంచో అల్లు కుటుంబానికి చాలా ఆప్తుడు అనే విషయం మనకు తెలిసిందే. అల్లు ఫ్యామిలీ హీరోలకు పిఆర్ గా కూడా ఈయన పనిచేశారు. ఇలా అల్లు ఫ్యామిలీతో ఎంతో సాన్నిహిత్యం ఉండడంతోనే అల్లు అర్జున్ ఆయన ఇంటికి వెళ్లారు. అయితే అల్లు అర్జున్ తన ఇంటికి రావడం పట్ల ఎస్ కే ఎన్ స్పందించి సంతోషం వ్యక్తం చేశారు.

అల్లు అర్జున్ (Allu Arjun) తన ఇంటికి వచ్చి తనను ఓదార్చడంతో తనకు చాలా ఉపశమనం కలిగిందని ఇలా అల్లు అర్జున్ తన ఇంటికి రావడం సంతోషంగా ఉందని అందుకు అల్లు అర్జున్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఈయన చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఇక ఎస్కేయన్ విషయానికి వస్తే ఈయన నిర్మాతగా పలు సినిమాలను నిర్మిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus