Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

పైన కనిపిస్తున్న ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఓ పిల్లాడు ఉన్నాడు. అంతా చూసే ఉంటారు. అతను ఇప్పుడు ఓ పాన్ ఇండియా సూపర్ స్టార్ అనే సంగతి తెలుసా? కానీ ఇది నిజం.? ఆ పిల్లాడు మరెవరో కాదు మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun).

Allu Arjun

ఏంటీ..! కమల్ హాసన్ తో అల్లు అర్జున్ స్క్రీన్ షేర్ చేసుకున్నాడా? ఇదెప్పుడు జరిగింది? ఆ కథ తెలుసుకోవాలంటే మనం 40 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి. అల్లు అర్జున్, కమల్ హాసన్.. ఈ ఇద్దరు స్టార్స్ ఒకే స్క్రీన్‌పై కనిపిస్తే థియేటర్లు దద్దరిల్లాల్సిందే.

కానీ వీరిద్దరూ కలిసి ఇప్పటికే ఒక సినిమాలో నటించారనే సంగతి చాలా మందికి తెలిసుండదు? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నూటికి నూరు పాళ్లు నిజం. ఆ సినిమా మరేదో కాదు ‘స్వాతిముత్యం’.

కె. విశ్వనాథ్ గారి అద్భుత సృష్టిగా వచ్చిన ఈ సినిమాలో కమల్ హాసన్ శివయ్య అనే మందబుద్ది కలిగిన పాత్రలో నటించాడు. ఇదే సినిమా ప్రారంభంలో శివయ్య పాత్ర వృద్దుడిగా కనిపిస్తుంది. ఆ టైమ్లో శివయ్యను పలకరించడానికి విదేశాల నుండి మనవళ్లు, మనవరాళ్లు వస్తారు. ఆ పిల్లల గ్యాంగ్‌లో నాలుగేళ్ల బుజ్జి బాబు అల్లు అర్జున్ కూడా ఉంటాడు. డైలాగులు లేకపోయినా, ఆ ఫ్రేమ్‌లో అల్లు అర్జున్ ఉండటం ఇప్పుడు అభిమానులకు ఒక మధుర జ్ఞాపకం అని చెప్పొచ్చు.

1986 మార్చి 13న ‘స్వాతిముత్యం’ విడుదలైంది. నిన్నటితో 40 వసంతాలను పూర్తి చేసుకుంది.అల్లు అర్జున్ కేవలం కమల్ హాసన్‌తోనే కాదు, అంతకుముందు చిరంజీవి ‘విజేత’ (1985) సినిమాలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు.చిన్న వయసులోనే ఇద్దరు దిగ్గజ నటులైనటువంటి చిరంజీవి, కమల్ హాసన్ వంటి వారి సినిమాల్లో నటించే అరుదైన అవకాశం బన్నీకి దక్కింది.

బన్నీ థియేటర్‌లో బాబాయ్‌ – అబ్బాయిల హంగామా పక్కా.. ఆ టెక్నాలజీలోనే సినిమా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus