అల్లు అర్జున్ రస్టిక్ లుక్ ఫోటోలు వైరల్..!

  • July 3, 2020 / 05:00 PM IST

ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ బయట తెగ తిరిగేస్తున్నాడు. లాక్ డౌన్ టైంలోనే బయట ఎక్కువగా కనపడుతున్నాడు బన్నీ. లాక్ డౌన్ ప్రారంభమైనప్పుడు జూబ్లీ హిల్స్ లోని ఓ పాపులర్ సూపర్ మార్కెట్ లో నిత్యావసరాలకోసం వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు మన స్టైలిష్ స్టార్. వైరస్ మహమ్మారి కారణంగా ఏర్పడ్డ లాక్ డౌన్ వల్ల.. తన ఇంట్లో పనిచేసే వారికి సెలవులు ఇచ్చి.. వారికి మూడు నెలల జీతం కూడా ఇచ్చేశాడట బన్నీ.

అందుకే అప్పుడు అలా బయటకు వచ్చాడని వార్తలు వచ్చాయి. అటు తర్వాత తన ఇంటి దగ్గరలోని ఓ వీధిలో వాకింగ్ చేస్తూ కెమెరాకు చిక్కాడు.రోడ్ల పైన జనాలెవ్వరూ లేని కారణంగా అప్పుడు క్యాజువల్ వాక్ కు బన్నీ రాగా ఎవరో క్లిక్కు మనిపించి.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేసారు. అంతే అవి కూడా తెగ వైరల్ అయిపోయాయి. ఇదిలా ఉండగా.. ఇప్పుడు జూబ్లిహిల్స్‌లోని కేబీఆర్‌ పార్క్ లో కూడా దర్శనమిచ్చాడు బన్నీ.

అక్కడ కూడా పెద్దగా జనాలు రావడం లేదని తెలుసుకుని జాగింగ్ కు వచ్చాడట.అయితే అక్కడికి వచ్చిన ఒకరిద్దరు మాత్రం.. బన్నీని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టేసారు. మాసిన గడ్డంతో బన్నీ ఈ పిక్స్ లో కనిపిస్తున్నాడు. బహుశా ‘పుష్ప’ సినిమాకోసమే ఇలా రస్టిక్ గా తయారవుతున్నాడనుకుంట. ఈ పిక్స్ లో అల్లు అర్జున్ తో పాటు అతని భార్య స్నేహ రెడ్డి కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు కూడా వైరల్ గా మారాయి.

1

2

3

4

Most Recommended Video

భానుమతి & రామకృష్ణ సినిమా రివ్యూ & రేటింగ్!
సినిమాల్లోకి రాకముందు మన హీరోయిన్స్ ఎలా ఉంటారో చూస్తే.. షాక్ అవ్వాల్సిందే..!
అట్టర్ ఫ్లాప్ సీజన్ అంటే ఇదేనేమో..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus