అట్టర్ ఫ్లాప్ సీజన్ అంటే ఇదేనేమో..!

లాక్ డౌన్ వల్ల మనకి టైం తెలీడం లేదు కానీ.. అప్పుడే 6 నెలలు గడిచిపోయింది. ఈ మాయదారి వైరస్ మహమ్మారి వల్ల దేశం మొత్తం అతలాకుతలం అయిపోయింది. అన్ని పరిశ్రమలకు తీవ్ర నష్టాలు వాటిల్లాయి. ఈ నష్టాలు ఎప్పటికి తీరతాయో కూడా తెలీని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా సినీ పరిశ్రమ అయితే కొన్ని వందల కోట్లు నష్టపోయింది.థియేటర్లు మూతపడ్డాయి.. ఎన్నో సినిమాలు రిలీజ్ కు నోచుకోలేకపోయాయి. అయితే ఓటిటి ఇండస్ట్రీకి మాత్రం ఈ సీజన్ బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ఎప్పుడో మూలాన పడిపోయిన సినిమాలు కూడా ఓటిటిల పుణ్యమా అని విడుదల అవుతున్నాయి. చిన్న సినిమాల నిర్మాతలకు కూడా ఓటిటి వరంగా మారిపోయింది.

అయితే 5వ విడత లాక్ డౌన్ లో.. కొన్ని పరిశ్రమలకు మినహాయింపులు ఇచ్చారు కాబట్టి థియేటర్లు ఓపెన్ అయ్యే అవకాశం ఉందని అంతా భావించారు. అయితే షూటింగ్ లకు పర్మిషన్ లభించింది కానీ థియేటర్లు మాత్రం తెరుచుకోలేదు. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఇక ఇప్పట్లో తెరుచుకోవని అందరికీ క్లారిటీ వచ్చేసింది. ఇదిలా ఉండగా.. మార్చి 19వరకూ థియేటర్లు ఓపెన్ అయ్యాయి. మరి అప్పటి వరకూ విడుదలైన సినిమాలు ఏంటి.. వాటి రిజల్ట్ ఏంటి అన్న విషయం పై ఓ లుక్కేద్దాం రండి :

1) అల వైకుంఠపురములో: అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన 3వ చిత్రం ‘అల వైకుంఠపురములో’ ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం కలెక్షన్ల పరంగా 162 కోట్ల షేర్ ను రాబట్టి బన్నీ కెరీర్ బెస్ట్ గా నిలిచింది.

2)సరిలేరు నీకెవ్వరు: మహేష్ బాబు- అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం కూడా సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది.ఈ చిత్రం 138 కోట్ల వరకూ కలెక్ట్ చేసింది.

3)ఎంతమంచి వాడవురా : కళ్యాణ్ రామ్- సతీష్ వేగేశ్న కాంబినేషన్లో వచ్చిన ‘ఎంతమంచి వాడవురా’ చిత్రం సంక్రాంతికే విడుదలయ్యి మంచి ఓపెనింగ్స్ ను అయితే సాధించింది కానీ హిట్ స్టేటస్ ను మాత్రం దక్కించుకోలేకపోయింది.

4) దర్బార్ : సంక్రాంతి కానుకగా విడుదలైన రజినీకాంత్, మురుగదాస్ ల ‘దర్బార్’ చిత్రం కూడా ప్లాప్ గా మిగిలింది.

5) డిస్కో రాజా : వరుస ప్లాపుల్లో ఉన్న రవితేజకు ‘డిస్కో రాజా’ కూడా రిలీఫ్ ను ఇవ్వలేకపోయింది. విఐ ఆనంద్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం ప్లాప్ అయ్యింది.

6) అశ్వద్ధామ : నాగ శౌర్య హీరోగా రమణ తేజ డైరెక్షన్లో తెరకెక్కిన ‘అశ్వద్ధామ’ చిత్రం యావరేజ్ గా నిలిచింది.

7) చూసి చూడంగానే : రాజ్ కందుకూరి నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం కూడా ప్లాప్ అయ్యింది.

8) జాను : 96 రీమేక్ గా తెరకెక్కిన సమంత, శర్వానంద్ ల ‘జాను’ కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

9) వరల్డ్ ఫేమస్ లవర్ : విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం కూడా అట్టర్ ప్లాప్ అయ్యింది.

10) భీష్మ : నితిన్ హీరోగా ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల డైరెక్షన్లో తెరకెక్కిన ‘భీష్మ’ చిత్రం సూపర్ హిట్ అయ్యింది.

11) హిట్ : విశ్వక్ సేన్ హీరోగా శైలేష్ కొలను డైరెక్షన్లో తెరకెక్కిన ‘హిట్’ చిత్రం కూడా మంచి కలెక్షన్లను రాబట్టింది.

12) కనులు కనులను దోచాయంటే : దుల్కర్ సల్మాన్, రీతూ వర్మ జంటగా నటించిన ‘కనులు కనులను దోచాయంటే’ చిత్రం కూడా మంచి హిట్ చిత్రంగా నిలిచింది.

13) అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి : ధన్యా బాలకృష్ణ, కోమలీ ప్రసాద్, సిద్ది ఇద్నానీ, త్రిధా చౌదరి వంటి భామలు ప్రధాన పాత్రల్లో బాలు అడుసుమిల్లి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం కూడా ప్లాప్ గా మిగిలింది.

14) ఓ పిట్ట కథ : ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావు హీరోగా నటించిన ‘ఓ పిట్ట కథ’ చిత్రం కూడా ప్లాప్ గా మిగిలింది.

15) డిగ్రీ కాలేజ్ : 5 ఏళ్ళ క్రితం నరసింహ నంది డైరెక్షన్లో తెరకెక్కిన ఈ ‘డిగ్రీ కాలేజ్’ చిత్రం ఎట్టకేలకు ఈ ఏడాది విడుదలయ్యింది. అడల్ట్ కంటెంట్ సినిమా అందులోనూ లో బడ్జెట్ లో తెరకెక్కింది కాబట్టి యావరేజ్ గా నిలిచింది.

 

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus