Allu Arjun : టాలీవుడ్ హీరోలకు కలిసిరాని కోలీవుడ్ డైరెక్టర్లతో బన్నీ రిస్క్ చేస్తున్నాడా ?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత కీలక దశలో ఉన్నారు. ‘పుష్ప’ ఫ్రాంచైజీతో దేశవ్యాప్తంగా భారీ గుర్తింపు సంపాదించిన ఆయన, ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని వరుస భారీ ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నారు. అయితే ఈసారి ఆయన తీసుకుంటున్న నిర్ణయాల్లో ఒక విషయం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు కారణమవుతోంది. అదే వరుసగా తెలుగు దర్శకుల కంటే తమిళ, మలయాళ దర్శకులతో సినిమాలు చేయడం.

Allu Arjun

అల్లు అర్జున్ ఇప్పటివరకు సాధించిన కెరీర్ విజయాల్లో ఎక్కువ భాగం తెలుగు దర్శకులతో చేసిన చిత్రాల ద్వారానే వచ్చింది. సుకుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్, పూరి జగన్నాథ్, సురేందర్ రెడ్డి వంటి దర్శకులతో తెరకెక్కిన సినిమాలు ఆయనను స్టార్ హీరోగా నిలబెట్టాయి. కానీ ప్రస్తుతం మాత్రం ఆయన తన కెరీర్‌ను కొత్త దిశలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది.

ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘రాకా’ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ కోసం నెలల తరబడి కథా చర్చలు జరిగిన తర్వాతే అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో కూడా ఓ సినిమా చేయడానికి ఆయన సిద్ధమవుతున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్‌తో కూడా ఓ ప్రాజెక్ట్‌పై చర్చలు జరుగుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇలా ఒకేసారి పలు భాషల దర్శకులతో పనిచేయడం ద్వారా అల్లు అర్జున్ తన మార్కెట్‌ను మరింత విస్తరించాలని చూస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భాషతో సంబంధం లేకుండా బలమైన కథలు, కొత్త కాన్సెప్ట్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలనే ఆలోచనతోనే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

అయితే పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించడం అంత సులభం కాదు. దర్శకుడు ఏ భాషకు చెందిన వారైనా చివరికి ప్రేక్షకులను ఆకట్టుకునేది కథ, కథనం మాత్రమే. అందుకే అల్లు అర్జున్ ఎంపిక చేస్తున్న ప్రతి ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే టాలీవుడ్ హీరోలకి కలిసిరాని తమిళ్ డైరెక్టర్స్, ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఈ ప్రాజెక్టులు అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారో, వాటితో బన్నీ మరోసారి బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తారో చూడాల్సి ఉంది.

Vijay and Ajith: విజయ్‌ సినిమాకు టికెట్‌ అడిగిన అజిత్‌.. ఏ సినిమాకంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus