మెగాస్టార్ మూవీలో స్టైలిష్ స్టార్!

  • September 11, 2018 / 06:44 AM IST

తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మూవీ వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ విశేషంగా ఆకట్టుకుంది. చిరు నటన, సురేందర్ రెడ్డి టేకింగ్, అమిత్ త్రివేది సంగీతం, రత్నవేలు విజువల్స్ అన్ని కలిసి సినిమాపై అంచనాలను పెంచింది. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ తో పాటు నలుగురు హీరోలు నటిస్తున్నారు. సినిమా రారాజు అమితాబ్ బచ్చన్, డేరింగ్ స్టార్ జగపతి బాబు, కన్నడ స్టార్ కిచ్చ సుదీప్, తమిళ హీరో విజయ్ సేతు పతి లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ఐదు మంది హీరోయిన్స్ నటిస్తున్నారు.

సైరాకి మొదటి భార్యగా నయనతార, రెండో భార్య గా హ్యూమా ఖురేషి, మూడో భార్యగా ప్రగ్యా జైస్వాల్‌ నటిస్తున్నారు. ఇక తమన్నా ఒక పోరాట వనితగా కనిపించనుంది. అలాగే మెగా ప్రిన్సెస్ నిహారిక గిరిజన అమ్మాయిగా చిన్నరోల్ చేస్తోంది. పూనమ్ కౌర్ కూడా మంచి రోల్ పట్టేసింది.   అయితే తాజాగా ఈ బృందంలో మరో స్టార్ హీరో కలిసారు. అతనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి గా నటించి ప్రసంశలు, అవార్డులు అందుకున్న బన్నీ ఇందులోనూ అలాంటి రోల్ చేస్తున్నట్టు ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. ఈ వార్త మెగా అభిమానుల్లో ఆనందాన్ని నింపింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus