Allu Arjun: కళ్ళు లేని వాడిగా అల్లు అర్జున్ క్యారెక్టర్

  • June 22, 2021 / 07:49 AM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎలాంటి సినిమా చేసినా కూడా విబిన్నంగా ఉండాలని అనుకుంటాడు. వీలైనంత వరకు రొటీన్ గా ఉండకుండా తన పాత్ర విధానాన్ని కూడా సరికొత్తగా ప్రజెంట్ చేస్తాడు. కేవలం దర్శకుడు చెప్పింది మాత్రమే కాకుండా తనకు నచ్చిన ఐడియాలను కూడా అప్లై చేస్తుంటాడు. ప్రతి విషయంలో కూడా ఫ్రెండ్లిగా ఇన్వాల్వ్ అవుతూ సినిమా విజయంలో కీలక పాత్ర పోషిస్తుంటాడు. ఇక ఐకాన్ సినిమాలో అల్లు అర్జున్ చేయబోయే పాత్ర కూడా విబిన్నంగా ఉండబోతున్నట్లు సమాచారం.

తన కెరీర్ లో ఎప్పుడు లేని విధంగా ఒక లోపం ఉన్న పాత్రను టచ్ చేస్తున్నట్లు సమాచారం. ఒక కళ్ళు లేని హీరోలా కనిపిస్తాడట. అందులో ఒక ఆశయంతో గెలుపు కోసం పరితపించే ప్రయత్నం హార్ట్ టచింగ్ గా ఉంటుందట. అలాగని ఎమోషన్ గా వెళ్లకుండా దర్శకుడు వేణు శ్రీరామ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ను పుష్కలంగా మిక్స్ చేస్తాడని సమాచారం. ఇక ఇదివరకే మాస్ రాజా రవితేజ కళ్ళు కనిపించని పాత్రతో బాక్సాఫీస్ హిట్ కొట్టాడు.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన రాజా ది గ్రేట్ ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక అందాదున్ రీమేక్ తో నితిన్ కూడా అలాంటి పాత్రతో మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నడు. ఇక అల్లు అర్జున్ ఏ తరహాలో ఎట్రాక్ట్ చేస్తాడో చూడాలి. పుష్ప 1 అనంతరం అల్లు అర్జున్ ఐకాన్ సినిమాను స్టార్ట్ చేయబోతున్నాడు.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus