సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?

  • June 9, 2021 / 08:15 PM IST

నందమూరి బాలకృష్ణకి ఉన్న మాస్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన పాత కథలు చేసినా అవి బాగుంటే జనాలు ఎగబడి చూస్తారు. అదే సినిమా మరో హీరో చేస్తే కచ్చితంగా ప్లాప్ అంటారు. అలాంటి ఇమేజ్ టాలీవుడ్లో ఒక్క బాలయ్యకే ఉంది.ఇప్పటికీ ఆ ఇమేజ్ బాలయ్య మెయింటైన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని పక్కన పెడితే.. చిత్రసీమ సెంటిమెంట్ లకు పెద్దపీట వేస్తుంది అన్న సంగతి తెలిసిందే. నిర్మాతలకే కాదు హీరోలకు, అభిమానులకు కూడా హిట్టు సెంటిమెంట్లు, ప్లాప్ సెంటిమెంట్లు చాలానే ఉంటాయి.అలాగే బాలయ్యకి కూడా ఓ సెంటిమెంట్ ఉంది. అదేంటంటే ఆయన చేసే సినిమాల టైటిల్స్ లో సింహా అని వస్తే అది మినిమమ్ గ్యారంటీ. ఆయన కెరీర్ లో చేసిన సినిమాల్లో సింహా అని టైటిల్ లో వస్తే హిట్ అయినవి చాలానే ఉన్నాయి.ఇంతకీ సింహా టైటిల్ తో బాలయ్య చేసిన సినిమాలు ఏంటో.. వాటి రిజల్ట్ ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1)సింహం నవ్వింది :

1983లో తన తండ్రి సీనియర్ ఎన్టీఆర్‌తో బాలయ్య కలిసి చేసిన సినిమా ఇది. కానీ బాక్సాఫీస్ వద్ద ఇది విజయం సాధించలేదు.

2)బొబ్బిలి సింహం :

1994 వ సంవత్సరంలో కోదండరామిరెడ్డి డైరెక్షన్లో బాలయ్య చేసిన సినిమా ఇది. బాక్సాఫీస్ వద్ద ఇది సూపర్ హిట్ అయ్యింది.

3)సమరసింహారెడ్డి :

బి.గోపాల్ డైరెక్షన్లో బాలయ్య చేసిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అయ్యింది.

4)నరసింహనాయుడు :

మళ్ళీ బి.గోపాల్ డైరెక్షన్లో బాలయ్య చేసిన ఈ ఫ్యాక్షన్ సినిమా ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాసింది.

5)సీమ సింహం :

జి.రామ్ ప్రసాద్ డైరెక్షన్లో బాలయ్య చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ ఫలితాన్ని అందుకుంది.

6)లక్ష్మీనరసింహా :

‘సామి’ రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. జయంత్.సి.పరాన్జీ ఈ చిత్రానికి దర్శకుడు.

7) సింహా :

బోయపాటి శ్రీను డైరెక్షన్లో బాలయ్య చేసిన ఈ మాస్ మూవీ ఆ టైంకి బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అంతేకాదు వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్న బాలయ్యకు రిలీఫ్ ను ఇచ్చిన మూవీ ఇది.

8)జైసింహా :

కె.ఎస్.రవికుమార్ డైరెక్షన్లో బాలయ్య చేసిన ఈ మూవీకి కూడా కమర్షియల్ సక్సెస్ ను అందుకుంది.

9)లయన్ :

సింహం అని అర్థం వచ్చేలా ‘లయన్’ టైటిల్ తో బాలయ్య ఈ సినిమా చేసాడు.సత్యదేవ్ ఈ చిత్రానికి దర్శకుడు. కానీ ఈ చిత్రం ప్లాప్ అయ్యింది.

10)విక్రమ్ సింహా :

కోడి రామకృష్ణ డైరెక్షన్లో బాలకృష్ణ నటించాల్సిన సినిమా ఇది. షూటింగ్ మధ్యలో ఆగిపోయిన సినిమా ఇది. ఈ మూవీ కంప్లీట్ అవ్వకుండానే నిర్మాత మరియు దర్శకుడు మరణించారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus