Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Advertisement

అల్లు అర్జున్‌ని అభిమానులు మొన్నీమధ్య వరకు స్టైలిష్‌ స్టార్‌ అని పిలిచేవారు. ‘పుష్ప’ సినిమల వరకు బన్నీని అలానే పిలిచారు. మధ్యలో ఆయన మనసు మెగాస్టార్‌ వైపు వెళ్లింది అని వార్తలొచ్చాయి కూడా. ఆహా టీమ్‌ అయితే అలాంటి ఓ నోటిఫికేషన్‌ని కూడా పంపాయి. ఆ విషయం పక్కన పెట్టేస్తే.. ఇప్పుడు ఆయన్ను ఫ్యాన్స్‌ ‘ఐకాన్‌ స్టార్‌’ అని పిలుస్తున్నారు. అయితే ఈ విషయంలో అప్‌డేటెడ్‌ సమాచారం అల్లు అర్జున్‌ టీమ్‌ దగ్గరే లేదా? ఏమో కొత్తగా ఓపెన్‌ అయిన ‘అల్లు సినిమాస్‌’లోని స్టార్‌ వాల్‌ చూస్తే ఈ డౌటనుమానం వస్తోంది.

Allu Arjun

ఇండియన్‌ సినిమాలో స్టార్‌ హీరోల పేర్లను ఓ వాల్‌పై ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ‘అల్లు సినిమాస్‌’ మల్టీప్లెక్స్‌లో. నట సార్వభౌమ ఎన్టీ రామారావు, సూపర్‌ స్టార్‌ కృష్ణ, నటసామ్రాట్‌ నాగేశ్వర రావుతో మొదలుపెట్టి.. హృతిక్‌ రోషన్‌ వరకు ఈ నేమ్‌ వాల్‌ మీద పేర్లు ఉన్నాయి. అయితే ఆ పేర్ల దగ్గర ఇచ్చిన బిరుదులు / ట్యాగ్స్‌ దగ్గరే అసలు సమస్య వచ్చింది. బన్నీ పేరు దగ్గర స్టైలిష్‌ స్టార్‌ అని రాశారు. మహేష్‌ బాబు పేరు ముందు ప్రిన్స్‌ అని పెట్టారు. ప్రభాస్‌కి డార్లింగ్‌ అనే రాశారు. రామ్‌చరణ్‌కు చెర్రీ అని మాత్రమే పెట్టారు.

కమల్‌ హాసన్‌కు కాలై జ్ఞాని అని రాయగా.. సూర్యకు నడిప్పిన్‌ నాయన్‌ అని రాసుకొచ్చారు. ఈ రెండు పేర్లు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేనివే. నాని పేరు తర్వాత రాసిన ఏ హీరో పేరుకు కూడా ట్యాగ్‌లైన్‌లు రాయలేదు. అలా అని వారికి ట్యాగ్స్‌ లేవని కాదు.. అల్లు అర్జున్‌ టీమ్‌ రాయలేదు అంతే. ఇలా సగం మందికి ట్యాగ్ ఇచ్చి, ఇంకొంతమంది పాత ట్యాగ్‌లు ఇచ్చి అటు ఇటు కాకుండా చేశారు ఆ నేమ్‌ వాల్‌. ఓ లెక్క ప్రకారం అయితే తొలుత హీరోకు వచ్చిన ట్యాగ్‌లు ఇచ్చారని చెప్పొచ్చు. మరి బన్నీ టీమ్‌ ఉద్దేశం ఏంటో?

మెగాఫోన్‌ పట్టనున్న స్టార్‌ డ్యాన్స్‌ డైరక్టర్‌.. హీరో స్టార్‌ కొరియోగ్రాఫర్‌ తనయుడే!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read